బెల్లంకొండ హీరో జోరు మాములుగా లేదే..!

బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ హీరోగా ఎంటర్ అయిన దగ్గర నుండి వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తండ్రి బెల్లంకొండ సురేష్ అండతో భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. అలాగే టాప్ హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేస్తున్నాడు. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిట్ కాకపోయినా… అతను మాత్రం సినిమాలు చెయ్యడం మానడం అటుంచి.. కనీసం గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం చిత్రాలను వరసబెట్టి చుట్టేసిన బెల్లంకొండ తాజాగా కొత్త దర్శకుడితో కమిట్ అవడమే కాదు… ఆ సినిమాని అప్పుడే క్లైమాక్స్ కి తీసుకొచ్చేసాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్న శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

మరో రెండు సినిమాలు లైన్ లో…

ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత దర్శకుడు తేజ బెల్లంకొండ శ్రీనివాస్ తో తన తదుపరి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త దర్శకుడి సినిమాతో పాటు తేజ దర్శకత్వంలోని సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనూ బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ తోనే జోడి కడుతున్నాడు . ఇక ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతున్నాయి. ఒక సినిమా అభిషేక్ పిక్చర్స్ తో, మరొక సినిమా పెద్ద నిర్మాణ సంస్థతో ఉండబోతోందనే టాక్ వినబడుతుంది.

రిజల్ట్ తో సంబంధం లేకుండా…

ఒక సినిమా కొత్త దర్శకుడితో, మరొక సినిమా టాప్ డైరెక్టర్ తో ఉండబోతున్నాయట. మరి ఈ రెండు సినిమాలను బెల్లంకొండ ఈ ఏడాది లోనే మొదలెట్టబోతున్నాడట. ఇక సినిమాల హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఇలా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ బెల్లంకొండ కుర్ర హీరోలకు షాకిస్తున్నాడు. ఎంతైనా బెల్లంకొండ సురేష్ అండ ఉండగా.. ఏ కొడుకైన ఇలాగే రెచ్చిపోక ఏం చేస్తాడనే డైలాగ్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.