బెల్లంకొండకు క్లాప్ కొట్టిన వినాయక్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానకరామ్ గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. పూజా కార్యక్రమంలో డైరెక్టర్లు వి.వి.వినాయక్, శ్రీవాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలి షాట్ కు డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ తేజ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. మాజీ మంత్రి దానం నాగేందర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

బెల్లంకొండతో రెండోసారి…

మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, అభిమన్యు సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఏకే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ తేజ, కాజల్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. అలాగే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ రెండోసారి కిలిసి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ మాటలు రాస్తుండగా శీర్ష రే సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

నటీనటులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్, అభిమన్యు సింగ్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*