ఈ హీరోపై ఇంత పెట్టుబడా..?

బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎంతో గ్రాండ్ గా ‘అల్లుడు శ్రీను’ సినిమాతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత సురేష్ బయర్స్ కి తక్కువ రేటుకి అమ్మి వాళ్ల పరంగా సక్సెస్ అనిపించుకున్నాడు కానీ నిర్మతగా సురేష్ కి మాత్రం నష్టాలే మిగిలాయి. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’ తో ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి.

మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు…

బోయపాటి శ్రీను.. శ్రీనివాస్ ని హీరోగా పెట్టి ‘జయ జానకీ నాయక’ సినిమాను తీసాడు. దీనికి మంచి స్పందనే వచ్చినా భారీ బడ్జెట్‌ వల్ల నష్టాలు తప్పలేదు. అయితే మార్కెట్ పరంగా చూసుకుంటే శ్రీనివాస్ కి 25 కోట్లు లోపే. కానీ ఆయన కొత్త సినిమా ‘సాక్ష్యం’ చిత్రానికి బడ్జెట్‌ ముప్ఫై ఐదు కోట్ల పైమాటే అంటున్నారు. అటు దర్శకుడు శ్రీవాస్ కి కూడా మార్కెట్ అంతగా లేదు. మరి ఏ ధైర్యంతో ఈ సినిమాపై ఇంత ఖర్చు పెట్టారనేది నిర్మాతలకే తెలియాలి.

ఈసారైనా లాభాలు తెస్తాడా..?

అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న అభిషేక్‌ పిక్చర్స్‌ వారికి బ్యాక్‌ ఎండ్‌లో బెల్లంకొండ సురేష్‌ ఫండింగ్‌ ఉందనే పుకార్లున్నాయి. ఎంత ఫండింగ్ ఉన్నా అతని మార్కెట్ 25 కోట్లు అయితే సినిమా తీయడానికే 35 కోట్లు ఖర్చు పెట్టారంటే అందుకు తగ్గట్లు వసూల్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఈసారి అయినా బెల్లకొండ శ్రీనివాస్ పై పెడుతోన్న పెట్టుబడికి తగ్గ విజయాన్ని సాధిస్తాడా అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*