భరత్ అనే నేను యూఎస్ లో రికార్డ్స్ కానీ

మహేష్ బాబు

మహేష్ ‘భరత్ అనే నేను’ ఓవర్సీస్ లో సెన్సషన్స్ ని క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా యూఎస్ లో. అక్కడ రంగస్థలం కలెక్షన్స్ ను ఈజీగా క్రాస్ చేస్తుంది. రిలీజ్ అయినా నాలుగు రోజులకే 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన భరత్.. ఇప్పుడు 2.6 మిలియన్ల మార్కును ఓవర్ టేక్ చేసింది. ఈ చిత్రం యూఎస్ లో ఫుల్ రన్ వసూళ్లు 4 మిలియన్ డాలర్ల ఉండొచ్చని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

రంగస్థలం మూవీ ప్రస్తుతం 3.5 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ వీకెండ్ తో బహుశా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం రన్ పూర్తయిపోవచ్చు. ఓవర్ ఆల్ గా రంగస్థలం ఫుల్ రన్ వచ్చేసరికి 3.6- 3.7 మిలియన్ డాలర్ల దగ్గర ఉండొచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం స్పీడ్ మీద ఉన్న భరత్ ఆ మార్కును అవలీలగా దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ సినిమాను కొన్న బయ్యర్స్ కు నష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే ఈ సినిమాను 18+ కోట్లకు అమెరికా రైట్స్ కొన్నట్లు టాక్. ప్రస్తుతం భరత్ అనే నేను 3.5 మిలియన్ డాలర్లను సాధించినా.. జస్ట్ బ్రేక్ఈవెన్ మాత్రమే అవుతుంది. మినిమం 4 మిలియన్లు వస్తే కాని.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాదట. కానీ రంగస్థలం మాత్రం 3.5 మిలియన్ డాలర్లను సాధించినా.. జస్ట్ బ్రేక్ఈవెన్ మాత్రమే అవుతుంది. మినిమం 4 మిలియన్లు వస్తే కాని.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాదట. చూద్దాం భరత్ యూఎస్ లో ఎంతవరకు సక్సెస్ అవుతాడో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*