నాన్ బాహుబలి రికార్డు కాయం
భరత్ అనే నేను మన ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకు ముందు నుండే బజ్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయ్. అందరు అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రదర్శనలు కాగా బెనిఫ్ట్ షోస్ కి కూడా పర్మిషన్ రావడంతో భరత్ అనే నేను మూవీ రికార్డు ఓపెనింగ్స్ సాధించడం ఖాయం అయిపోయింది.
మొదటి రోజు భరత్ అనే నేను మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించడం ఖాయంగా చెప్పేయచ్చు. మూవీ టాక్ కూడా బ్లాక్ బస్టర్ అని రావడంతో ఫ్యాన్స్ మంచి జోష్ మీద ఉన్నారు. కచ్చితంగా మరోసారి మహేష్ నాన్ బాహుబలి రికార్డ్స్ ను తన ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో అక్కడ కలెక్షన్స్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయడం కాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆకలి మీద ఉన్న మహేష్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఆకలి తీర్చనుంది. భరత్ అనే నేను చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ రికార్డు కలెక్షన్స్ ను కట్టబెట్టేస్తున్నారు ఫ్యాన్స్.