‘భరత్ అనే నేను’ హిందీ హక్కులకు భారీ ధర

సూపర్ స్టార్ మహేష్ బాబు..కొరటాల శివ డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమా చేశాడు. మొదటి నుండే ఈ సినిమాపై బజ్ ఉండటంతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దాదాపు 200 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో డబ్ చేస్తే అక్కడ కూడా భారీగానే వసూళ్లు దక్కాయి. అయితే తాజాగా ఈ సినిమా హిందీ సాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైందని తెలుస్తుంది.

22 కోట్లకు హిందీ హక్కులు…

హిందీలో మన తెలుగు సినిమాలకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను ఓ ప్రముఖ టివి ఛానల్ ఏకంగా 22 కోట్లకు ఈ హక్కులు తీసుకుందట. నిజానికి ఇది భారీ రేట్ అని చెప్పాలి. మన టాలీవుడ్ లో కొంత మంది హీరోల సినిమాలకు ఈ రేట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ ల సినిమాలకి ఈ రేట్స్ వస్తుంటాయి.

కేరీర్ లోనే మొదటిసారి…

మహేష్ కెరీర్ లోనే తన సినిమాకి ఇంత భారీ రేట్ రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Sandeep
About Sandeep 6185 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*