‘భారతీయుడు 2’… కమల్ తో కాకపోతే వారితోనే..!

రోబో ‘2.ఓ’ సినిమా నవంబర్ 29న రిలీజ్ కు రెడీ అవ్వడంతో ప్రస్తుతం ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు డైరెక్టర్ శంకర్. ‘రోబో’ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

రాజకీయాలకు ఆటంకంగా మారుతుందని…

‘భారతీయుడు 2’ ను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఫోకస్ పెడితే తనకు రాజకీయపరమైన పనులకు ఇబ్బంది కలుగుతుందని కమలహాసన్ భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాపై అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదట. ఒకవేళ ఈ సినిమా కమల్ చేయకపోతే.. విక్రమ్ తో అయినా.. యాక్షన్ కింగ్ అర్జున్ తో అయినా తీయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నట్టు కోలీవుడ్ లో టాక్.

ముఖ్య పాత్రలో అజయ్ దేవగణ్

ఇందులో ఒక కీలక పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. కమల్ నో చెప్పితే ‘భారతీయుడు 2’ లో అర్జున్ కానీ.. విక్రమ్ కానీ ఉంటారు. గతంలో శంకర్ ఇద్దరితో భారీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*