బిగ్ హౌసులోకి బిగ్ పార్టిసిపెంట్?

బిగ్ బాస్ వన్ లో స్టార్ పార్టిసిపేట్స్ లేకపోయినా… మొదటిసారిగా బిగ్ బాస్ షో ని తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్ యాంకరింగ్ తో బాగా ఎంజాయ్ చేశారు. కానీ సీజన్ 2 లో కూడా ఎన్టీఆర్ ఉంటె బిగ్ బాస్ 2 పరిస్థితి ఎలా ఉండేదో కానీ… ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ వలన సీజన్ 2 వ్యాఖ్యానం నేచురల్ స్టార్ నాని చేతికి వచ్చింది. అయితే నాని వ్యాఖ్యాతగా పెద్దగా అంచనాలు లేకుండా సీజన్ 2 జూన్ 10 నుండి బుల్లితెర మీద స్టార్ అయ్యింది. ఈ షో లో 16 మంది లో 13 మంది ఓ మాదిరి సెలబ్రిటీస్ కాగా మరో ముగ్గురు సాధారణ మనుషులు. అయితే ఈ షో 10 న నాని యాంకరింగ్ తో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 ఏమంత హుషారుగా అనిపించడం లేదు.. ఎక్కడ చూసినా ఇంట్రెస్ట్ కలగడం లేదనే టాక్ వినబడుతుంది. గీత మాధురి, తేజస్వి మడివాడ వంటి సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ షో చప్పగా సాగుతుందనే విమర్శలు మొదలయ్యాయి.

అయితే ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న స్టార్ మా బిగ్ బాస్ హౌస్ లోకి ఒక స్టార్ సెలెబ్రిటీని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ స్టార్ సెలెబ్రిటీ ఎవరన్నది బయటికి రావడం లేదుగాని… మొదటినుండి ఈ లిస్ట్ లో పేరున్న ఛార్మి ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ఏర్పాట్లను స్టార్ మా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గ్లామర్ షో, అందచందాలతో, ఆటపాటలతో బిగ్ బాస్ హౌస్ కి కాస్త కళ తేవాలని అందుకే ఛార్మి అయితే బావుంటుందని స్టార్ మా భావిస్తోందట. ఇక ఛార్మి గ్లామర్ తో షో రేటింగ్స్ పెరుగుతాయని స్టార్ మా ఇలాంటి ఆలోచన చేస్తుందట.

మరి ఎలాగూ ఛార్మి కి సినిమాల్లో అవకాశాలు లేవు. అలాగే నిర్మతగా కూడా సక్సెస్ కాలేక తంటాలు అపడుతున్న ఛార్మి ఇప్పుడు బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టి అక్కడి పార్టిసిపేట్స్ కి బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకులకు బూస్ట్ ఇచ్చి పనిలో పనిగా తానూ కూడా క్రేజ్ కొట్టెయ్యొచ్చు. మరి ఇది నిజంగా నిజమా.. కదా అనేది పక్కన పెడితే ఛార్మి మాత్రం బిగ్ హౌస్ లోకి రావాలని ప్రేక్షకులు బాగా కోరుకుంటున్నారనేది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది.

1 Comment on బిగ్ హౌసులోకి బిగ్ పార్టిసిపెంట్?

Leave a Reply

Your email address will not be published.


*