ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..!

మొదటి సీజన్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 2కు అంతగా క్రేజ్ లేకపోయినా.. గత కొన్ని వారాల నుండి సీజన్ 2 చాలా రసవత్తరంగా సాగుతుంది. నాని కూడా మొదటితో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య నుండి పర్లేదు అనిపిస్తున్నాడు. గత కొన్ని వారాల నుండి బిగ్ బాస్ తమ కంటెస్టెంట్స్ కు రకరకాల ఆసక్తికర టాస్క్ లు ఇస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. అందుకే షోపై ఇంట్రెస్ట్ వచ్చి జనాలు చూస్తున్నారు.

హైదరాబాద్ లో అవడంతో…

ఈ షోలో పార్టిసిపెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ జనాలని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ప్రతి వారంలా ఈవారం కూడా ఎలిమినేషన్ ఉంది. మొదటి సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో షో చూసే దాకా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ షో హైదరాబాద్ లో జరగటంతో ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే తెలిసిపోతోంది. అలానే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది. కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారు సేకరించిన పబ్లిక్ పల్స్ ప్రకారం ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ మరెవరో కాదు దీప్తి సునయిన అని చెబుతున్నారు.

దీప్తి సునయన బయటకు రావడం ఖయమా..?

దీప్తి సునయిన మొదట్లో చాలా సైలెంట్ గా ఉండేదని…పెర్ఫార్మన్స్ సరిగా ఇచ్చేది కాదని..ఆమె షోలో అంతగా యాక్టీవ్ గా ఉండేది కాదని విమర్శలు ఎదుర్కొంది. తనీష్..సామ్రాట్ సపోర్ట్ తో చాలా సార్లు ఎలిమినేషన్ నుండి తప్పుకుందని..కానీ ఈసారి ఎలిమినేషన్ నుండి ఆమెను ఎవరు కాపాడలేరని చెబుతున్నారు. మొన్నటివరకు గేమ్ చాలా సేఫ్ గా ఆడినా..రీసెంట్ గా నిర్వహించిన కాల్ సెంటర్ టాస్క్ లో మాత్రం కౌశల్ తో చాలా రూడ్ గా మాట్లాడడం మాత్రం ఎవరికీ నచ్చలేదని ఆమె ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే చాలామంది దీప్తి సునయిన ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. రేపు జరిగే ఎలిమినేషన్ లో అందరికంటే తక్కువ ఓట్లు ఆమెకే వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*