బిగ్ బాస్ పై పాపులారిటీ పెంచుతుంది

బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. కానీ సీజన్ టు కి అనుకున్నంత క్రేజ్ అయితే రావడం లేదు. నాని మొదటిసారి టివి లో వ్యాఖ్యాతగా చెయ్యడం… నాని ఎనర్జీ లెవల్స్ ఎన్టీఆర్ ఎనేర్జి తో పోటీ పడలేకపోవడం.. ఇలా అనేక విషయాలతో బిగ్ బాస్ షో మీద క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడుతూ బిగ్ బాస్ గేమ్ ని గేమ్ లాగే ప్లే చేస్తున్నారు. ఎవరూ తగ్గడం లేదు. మొదటి సీజన్ కన్నా ఎక్కువగా మాసాలతో పాటుగా.. రాజకీయాలు, గ్రూపులు ఇలా బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ షో నుండి మొదటి వారమే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా బయటికొచ్చిన సంజన బిగ్ బాస్ షో మీద అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఆమె బిగ్ బాస్ హౌస్ మీద షో మీద చేసిన సంచనల వ్యాఖ్యలు బిగ్ బాస్ షో ని చూడని వారిలో కాస్త ఆక్తిని పెంచుతున్నాయి. సంజన ఈ షో నుండి బయటికొచ్చాక ఛానల్స్ లో తెగ హడావిడి చేస్తూ బిగ్ బాస్ షోని విమర్చించడమే కాదు… యాంకరింగ్ చేస్తున్న నానిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించింది. నాని హోస్టింగ్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో పోలిస్తే నచ్చలేదని.. నాని ని మాములు ఫోన్ కింద.. ఎన్టీఆర్ ని ఐ ఫోన్ కింద పోల్చి మాట్లాడింది. అయితే సంజన చేసిన ఈ ఫోన్ వ్యాఖ్యలకు నాని కూడా స్మూత్ గా.. డీసెంట్ గా ఎక్కడ తగలాలోఅక్కడ తగిలేలా.. నాక్కూడా ఐ ఫోన్ అంటేనే ఇష్టమంటూ కౌంటర్ వేసాడు. అయితే సంజన తాజాగా మరొక ఛానల్ లో కూర్చుని బిగ్ బాస్ హౌస్ లో అందరూ రాజకీయాలు చేస్తున్నారని.. షోలో ఉన్నప్పుడు.. ఎప్పుడూ చెప్పినట్టే… సెలబ్రిటీస్, కామన్ మ్యాన్స్ అనే విభజన ఉందని ఆమె చెబుతుంది. నన్ను బయటికి పంపేసినట్టే.. నూతన నాయుడు, గణేష్ ని కూడా బయటికి పంపిస్తారని.. అక్కడ అందరూ గూడు పుఠాణి చేస్తున్నారని…. అబ్బో బిగ్ బాస్ షో మీద అనేకరకరాల వ్యాఖ్యలు చేసింది.

మరి సంజన చేస్తున్న ఈ సంచలన వ్యాఖ్యలు చూసిన వారు ఇంతకూ ముందు బిగ్ బాస్ షో చూడకపోతే.. ఇప్పుడు చూడాలనే కుతూహలం మొదలైంది. ఇక ఇలా సంజన బిగ్ బాస్ షోకి ఫ్రీ పబ్లిసిటీ చేసిపెడుతోంది. ఇంకా సంజన తనని బిగ్ బాస్ జైలులో వేసినప్పుడు కొందరు నూతన నాయుడితో కలిసి ఒకే బెడ్ మీద పడుకోమన్నారని… మధ్యలో దిండు పెట్టుకోమన్నారని… అసలు షోకి వచ్చే ముందు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటంటూ ఆమె బిగ్ బాస్ షో మీద విరుచుకుపడింది. ఇక ఇలాంటి షోలకి జన్మలో వెళ్లనంటూ చెప్పడమే కాదు.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉండే కన్నా బయటికి రావడమే మంచిదని ఆమె తండ్రి సంజనకు చెప్పారని చెబుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో అసలైంది చూపెట్టకుండా ఏవేవో ప్లే చేస్తున్నారని అంది. మరి సంజనకు బిగ్ బాస్ నియమాలు తెలియక.. ఈ షోకి వచ్చిందా… అయ్యో తెలుసుకుని రావాల్సిందే.. ఆమె కున్న షార్ట్ టెంపర్ వల్లనే తొందరగా బయటికి వెళ్ళింది… అమ్మో సంజన ఉంటె రోజు బిగ్ బాస్ హౌస్ లో గొడవలే అంటూ అకామెంట్స్ చేసినవాళ్లు ఉన్నారు. అయినా సంజన బిగ్ బాస్ నియమాలు తెలిసే.. ఆ షోలోకి అడుగుపెట్టాక.. తొందరగా ఎలిమినేట్ అయ్యి .. ఆ అక్కసుని బిగ్ బాస్ షో మీద చూపించడం ఎంతవరకు కరెక్ట్ అన్నవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ షో గురించి ఆసక్తిలేని వారు కూడా సంజన కాంట్రవర్సీ వలన ఆ షో కి ఎట్రాక్ట్ అవుతున్నారనేది మాత్రం వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*