అడకత్తెరలో పోక చెక్కలా మారిన బిగ్ బాస్..!

తెలుగు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. బయట కూడా అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2పై మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేని జనాలు.. చివరికి వచ్చేటప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని చెప్పినట్టు ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా రోజుకో గడబిడ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 సాఫీగా జరిగినట్టుగా సీజన్ 2 జరగడం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి బయట కౌశల్ ఆర్మీ అంటూ ఒకటి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుది కాదు. ఆ కౌశల్ ఆర్మీ అనేది బిగ్ బాస్ సృష్టించిందా.? లేదా కౌశల్ ఏర్పాటు చేసుకుందా.? లేదంటే నిజంగానే కౌశల్ కి అంత ఫ్యాన్ ఆర్మీ ఉందా.? అనేది క్లారిటీ లేదు. ఏది ఏమైనా కౌశల్ ఆర్మీతో బిగ్ బాస్ కి తలనొప్పి స్టార్ట్ అయ్యిందనేది వాస్తవం. ఇక హౌస్ లోతనీష్ చెప్పినట్టుగా బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ తో ఎవరు పెట్టుకున్నా.. వారి ఎలిమినేట్ అవడం తథ్యం… అన్నట్టుగా కౌశల్ తో గొడవ పడిన వారు వారానికొకరు చొప్పున బయటికొచ్చేశారు.

కౌశల్ ఆర్మీ టార్గెట్ చేయడంతో…

ఇక కేవలం అది కౌశల్ ఆర్మీ వల్లనే తాము టార్గెట్ అయ్యి హౌస్ నుండి బయటికొచ్చామని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయట ఇంటర్వూస్ లో చెప్పడంతో.. నిజంగానే కౌశల్ ఆర్మీకి అంత పవర్ ఉందా అనుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని తనీష్ ని బిగ్ బాస్ కి రికమెండ్ చేసాడని.. తనీష్ తప్పులని నాని ఎత్తి చూపకుండా సేఫ్ జోన్ లో ఉంచుతున్నాడని కూడా బయట టాక్. మరోపక్క గీత ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేకపోయినా… మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది… సీక్రెట్ టాస్క్ లు బాగా ఆడడంతో… ఆమెని ఫైనల్ వరకు తెచ్చారని టాక్ ఉంది. మరోపక్క ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండి… చిన్నపిల్లాడిలా ఉండే సామ్రాట్ కూడా ఫైనల్స్ కి పనికిరాడని అంటున్నారు. మరోపక్క బిగ్ బాస్ కూడా కౌశల్ ఆర్మీకి భయపడే స్క్రిప్ట్ ని మారుస్తుందని బయట టాక్ ఉంది. ఇక దీప్తి నల్లమోతు మాత్రం ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా తయారైంది.

టైటిల్ ఎవరికీ దక్కినా…

తాజాగా బిగ్ బాస్ టైటిల్ అనేది ఇప్పుడు ఎవరికి వచ్చినా అది ఎవరో ఒకరి రికమండేషన్ అనే ప్రమాదంలో బిగ్ బాస్ పడ్డాడు. అంటే బిగ్ బాస్ ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కమాదిరిగా నలిగిపోతున్నాడన్నమాట. బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కి ఇస్తే కౌశల్ ఆర్మీకి భయపడే బిగ్ బాస్ కౌశల్ కి టైటిల్ కట్టబెట్టారంటారు. మరి నిజంగానే బయట వాతావరణం అలానే ఉంది. బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కి రాకపోతే నానా రచ్చ జరిగేలా కౌశల్ ఆర్మీ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ యే అని కౌశల్ మాత్రమే కాదు కౌశల్ ఆర్మీ కూడా ఫిక్స్ అయ్యారు. ఇక ఒకవేళ తనీష్ కి బిగ్ బాస్ టైటిల్ వచ్చిందా.. అందులో నాని హ్యాండ్ ఉందని అంటారు. ఇప్పటికే తనీష్ ని నాని కాపాడుతున్నారనే టాక్ ఉంది. మరోపక్క గీత కి బిగ్ బాస్ టైటిల్ ఇచ్చినా.. ఆమెకెలా ఇస్తారు ఆమె ఎమన్నా స్ట్రాంగ్ గా ఉందా… ఎప్పుడూ ఆడవాళ్లతో ముచ్చట్లు తప్ప అంటారు. ఇక సామ్రాట్ కిస్తే.. ఇలా ఎలా ఇస్తారు. సామ్రాట్ ఎందులో స్ట్రాంగ్ అంటారు. ఇక మెయిన్ బిగ్ బాస్ ముందున్న ఆప్షన్ కేవలం దీప్తి నల్లమోతు మాత్రమే. దీప్తి నల్లమోతుకి బయట కూడా మంచి ఫాన్స్ ఉన్నారనేది.. ఆమెని ఎలిమినేషన్స్ నుండి కాపాడుతున్న దాన్నిబట్టి కొద్దిగా అర్ధమవుతుంది. టివి 9 యాంకర్ గా ఆమె బిగ్ బాస్ లో కూడా మంచి పేరే తెచ్చుకుంది. ఫైనల్ గా బిగ్ బస్ విన్నర్ ఎవరనేది ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేలో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*