బిగ్ బాస్ 3కి ఎవరైనా ఓకేనా..!

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ లో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ సీజన్స్ నడుస్తున్నాయి. మధ్యలో షారుఖ్ వచ్చినా అది సక్సెస్ కాక… మళ్లీ స్టార్ ఛానల్ వాళ్లు సల్మాన్ కి అధిక రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చేశారు. ఇక తాజాగా నడుస్తున్న బిగ్ బాస్ 12 సీజన్ ను సల్మాన్ తనదైన శైలిలో రక్తి కట్టిస్తున్నాడు. ఇక తమిళంలో కమల్ హోస్టింగ్ లో బిగ్ బాస్ రెండు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక తెలుగులో మొదటి సీజన్ తో ఎన్టీఆర్ తో నడిపించి హిట్ కొట్టిన స్టార్ మా రెండో సీజన్ ని మాత్రం నేచురల్ స్టార్ నాని చేతిలో పెట్టడం.. ఎన్టీఆర్ ముందు నాని తేలిపోవడం.. నాని హోస్టింగ్ కి మిక్స్డ్ టాక్ రావడం.. అలాగే నాని కూడా బిగ్ బాస్ 2ని సక్సెస్ ఫుల్ గా నడిపించినప్పటికీ .. ఈ మూడు నెలలు చాలా ఇబ్బందులు పడ్డాడు.

అప్పుడే సీజన్ 3 చర్చ…

అయితే నాని ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఈ బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్ అంటూ గ్రాండ్ ఫినాలే రోజున చెప్పడంతో… మూడో సీజన్ కి నాని హోస్ట్ చెయ్యడంటూ… అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. బిగ్ బాస్ కి కౌశల్ ఆర్మీకి మధ్యన నలిగిపోయిన నాని సీజన్ 2కి రాదంటున్నారు. అంతలోపు సీజన్ 3కి మరో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు తెరమీదకొచ్చాయి. సీజన్ 3 స్టార్ట్ కావడానికి ఏడెనిమిది నెలలు టైం ఉన్నప్పటికీ.. ఇప్పటినుండే బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గురించిన చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే సీజన్ 3కి గీత గోవిందంతో 100 కోట్ల క్లబ్బులో చేరి స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కానీ… మెగా హీరో అల్లు అర్జున్ కానీ.. లేదంటే భల్లాలదేవుడు రానా కానీ సీజన్ 3 హోస్టింగ్ చేస్తారంటూ… కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.

దగ్గుబాటి హీరోనా… మెగా హీరోనా…

మరి విజయ్ స్టార్ ఇమేజ్ బిగ్ బాస్ కి బాగా కలిసొస్తుంది. అలాగే అల్లు అర్జున్ కూడా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. రానా అయితే గంభీరంగా పంచ్ లతో పడేస్తాడు. ఇలా ఈ ముగ్గురు హీరోలే కాకుండా ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలేకి అతిథిగా వచ్చి బిగ్ బాస్ సీజన్ విన్నర్ ని ప్రకటించిన వెంకటేష్ కూడా బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా రావొచ్చని టాక్ అయితే వినబడుతుంది. మరి బిగ్ బాస్ త్రీ ఫైనల్ గా ఎవరి చేతికెళుతుందో అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*