బిగ్ బాస్ లో వారి రీఎంట్రీకి కారణమేంటీ..?

big boss 3 contestents

బిగ్ బాస్ -2 ప్రారంభానికి ముందు ఏమైనా జరగొచ్చు.. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ షోపై అంచనాలు పెంచారు. అయితే, అన్నట్లుగానే బిగ్ బాస్ లో పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంతకుముందు ఎలిమినేట్ అయిన కామన్ మ్యాన్ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల మళ్లీ హౌజ్ లోకి వచ్చేందుకు అవకాశం దక్కింది. బిగ్ బాస్ లోకి రీఎంట్రీ కల్పించడానికి నిర్వహించిన పోల్ లో ఎక్కువ మంది నూతన్ నాయుడు, శ్యామల కు ఓట్లు వేశారు. ఇద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడానే ఉండటంతో బిగ్ బాస్ ఇద్దరికీ అవకాశం కల్పించాడు. హౌజ్ మేట్స్ కి ఉన్న అధికారాలతో ఇంతకుముందు ఎలిమినేట్ అయిన శ్యామలకు ఈసారి ప్రేక్షకులు అండగా ఉన్నారు. ఇక నూతన్ నాయుడుకు అనుకూలంగా కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేయడం కలిసివచ్చింది. అయితే, వీరి ఎంట్రీ ఖాయమే అని ప్రకటించినా ఎప్పుడు హౌజ్ లోకి అడుగుపెడతారనే విషయం మాత్రం బిగ్ బాస్ ఇంకా డిసైడ్ చేయలేదు.

ఎవరూ ఎలిమినేట్ కాలేదని…

ఇక వారాంతాల్లో బిగ్ బాస్ కు కొత్త కళ వస్తోంది. ఎవరు ఎలిమినేట్ అయితారోననే ఒక టెన్షన్ హౌజ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉంటుంది. ఎవరు బయటకు వెళ్తారోనని హౌజ్ మేట్స్ అందరూ ఒక్కరు లేదా ఇద్దరి పేర్లు చెప్పి అంచనా వేశారు. అందులో ఎక్కువ మంది బాబు గోగినేని బయటకు వెళ్తాడని ఊహించారు. కానీ, ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని నాని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే, 11 కోట్ల ఓట్లు వచ్చాయని, కానీ, అవి ఎలిమినేషన్ కి సంబంధించి కాదని చెప్పి హౌజ్ మేట్స్ ను అయోమయంలోకి నెట్టాడు. ఇక విభిన్నమైన టాస్క్ తో బిగ్ బాస్ -2 ఆసక్తికరంగా మారుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*