నానిని చూశాక కూడానా..!

బిగ్ బాస్ సీజన్ – 1 ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చేయించి.. సీజన్ – 2 మాత్రం మీడియం రేంజ్ ఉన్న నానితో చేయించారు. అయితే ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నానిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నాని బిగ్ బాస్ కి అన్ ఫిట్ అని..నాని హోస్టింగ్ సరిగా చేయట్లేదని ఇలా చాలానే కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్ – 3 ఎవరు హోస్ట్ చేస్తారు అనే ఆసక్తి జనంలో విపరీతంగా ఉంది.

విజయ్ దేవరకొండ చేస్తారా..?

దానికి తోడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ చేసే అవకాశాలు ఉన్నాయి అని గెట్టిగా ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ మాత్రం ఈ వార్తలు పూర్తిగా ఖండిస్తున్నాడు. లేటెస్ట్ అయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో… నేను బిగ్ బాస్ హౌస్ లో ఒక గంట సేపు ఉండలేకపోయానని.. అక్కడ తాను రోజుల తరబడి ఉండటాన్ని అసలు ఊహించలేనని చెప్పేసాడు.

కుదరదు అంటున్నాడా..?

అయితే విజయ్ హోస్టింగ్ చేసేది వారానికి రెండు రోజులు మాత్రమే.. కానీ విజయ్ మాత్రం ఆ షో చేసే మూడ్ లో మాత్రం అసలు లేడు అని అర్థం అవుతుంది. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం మూడో సిరీస్ కోసం తీవ్ర కసరత్తులో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ కి సీజన్ – 3, 4 కోసం ముందే అడ్వాన్స్ కూడా ఇచ్చేసారంట. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా అయిపోయిందని టాక్. ఒకవేళ విజయ్ కాకపోతే ఎవరు అని ఆలోచనలో పడ్డారంట నిర్వాహకులు. గతంలో అల్లు అర్జున్, శర్వానంద్ లను ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు వారు నాని కి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి వెనక్కి తగ్గుతున్నారట. లేకపోతే ఎన్టీఆర్ నే రంగంలోకి దింపుతారేమో చూడాలి. మరి కొన్ని రోజుల్లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది.