వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన…?

మొదటి నుండి బిగ్ బాస్ సీజన్ 2పై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు. సీజన్ 2 కు ఎన్టీఆర్ యాంకరింగ్ కాదని తెలియడంతో జనాలు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత నాని అని తెలియడంతో కొంచెం కుదుట పడ్డారు. కానీ నాని ఎలా చేస్తాడో? ఎలా షో ని నెట్టుకొస్తాడో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ.. షో స్టార్ట్ చేసిన రెండు మూడు వారాల తర్వాత ఆ అనుమానాలు అన్ని పటాపంచలైపోయాయి. నాని చెప్పే పిట్ట కథలతో.. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే షో లోని కంటెస్టెంట్స్ చేసే తప్పులను ఎట్టి చూపుతూ వారు రియలైజ్ అయ్యేలా కోప్పడుతున్నాడు కూడా.

పార్టిసిపెంట్సే మైన‌స్సా..?

అయితే మొదటి సీజన్ లో పార్టిసిపెంట్స్ ప్లస్ అయ్యారు కానీ ఈ సీజన్ లో చాలామందికి తెలియని వాళ్లని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఏదో అలా అలా షోను లాకొచ్చే ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. ఒకే.. అయిందేదో అయ్యింది అని వైల్డ్ కార్డు ఎంట్రీ తో హీరోయిన్ నందినిని బిగ్ బాస్ హౌస్ కి పంపారు. అయితే ఆమె ఎవరికి తెలియకపోవడం వలన అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఆమె షో కి ఏ విధంగానూ ప్లస్ కాలేదు. ఈ లోపు కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ అని ప్రచారం జరిగినా దానిని హెబ్బా పటేల్ ఖండించేసింది.

హౌజ్ లో కాలు పెట్టిన ప్ర‌దీప్‌

అయితే హెబ్బా బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ద్వారా వైల్డ్ గా యాంకర్ ప్రదీప్ మాచిరాజు కాలు పెట్టాడు. ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో, టీవీ షోల‌తో తనదైన శైలిలో.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని అలరించిన ప్రదీప్ ను బిగ్స్ బాస్ హౌస్ లోకి పంపించారు. ఢీ 10 లో కామెడీతో అందరినీ ఎంటర్‌టైన్‌ చేసిన ప్రదీప్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి నవ్వులు పూయిస్తాడో చూడాలి. తన కామెడీ టైమింగ్ తో మేల్ యాంకర్ గా అస్సలు గ్యాప్ లేకుండా దూసుకుపోతున్న ప్రదీప్ ఇప్పుడు ఢీ 10 గ్రాండ్ ఫినాలేని ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో మిగతా 10 వారాలు తన కామెడీ అండ్ బిగ్ గేమ్ తో ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

ప్రోమో ద్వారా తెలిపిన స్టార్ మా

మరి ప్రదీప్ మాచిరాజు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యాన్ని స్టార్ మా వారు ఓ ప్రోమో ద్వారా తెలియజేసారు. దాంతో ఇంకా బిగ్ బాస్ లోకి ఇక ఎంటర్టైన్మెంట్ పక్కా అని అందరూ అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకు చప్పగా సాగిన బిగ్ బాస్ ఈరోజు నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగనుంది. మరి బిగ్ బాస్ ఇప్పటికే మెల్లి మెల్లిగా ప్రేక్షకాదరణ పొందింది. బిగ్ బాస్ సెకండ్ సీజన్ బాగోలేదన్న వాళ్లే మళ్లీమళ్లీ ఆ షోని తిలకిస్తున్నారంటేనే ఆ షో మీద క్రేజ్ ఎంతుందో తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*