విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్..?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రంపై గత నాలుగైదేళ్లుగా వార్తల్లొచ్చినా శ్రీదేవి గత ఏడాది తన కూతురిని బాలీవుడ్ నుండి వెండితెరకు పరిచయం చేసింది. శ్రీదేవి కన్నుమూశాక జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నేతృత్వంలో ధఢక్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. శ్రీదేవికి ఉన్న అభిమానగణం యావరేజ్ అయిన ధఢక్ సినిమాని హిట్ చేశారు. జాన్వీ కపూర్ కూడా సో సో లుక్స్ తోనే ఆకట్టుకుంది. అయితే ఆమె ధఢక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో.. జాన్వీ ఇక హీరోయిన్ గా బాగా బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటుంది.

విజయ్ తో నటించే అవకాశం…

అయితే ధఢక్ సినిమా విడుదలయ్యాక జాన్వీ కపూర్ ని తెలుగులోకి దింపేందుకు పలువురు దర్శకనిర్మాతలు కాచుకుని కూర్చున్నారని టాక్ మాములుగా నడవలేదు. దిల్ రాజు దగ్గర నుండి.. రాజమౌళి మల్టీస్టారర్ వరకు జాన్వీ కపూర్ ని తీసుకొస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. బోని కపూర్ కూడా జాన్విని దక్షిణాదిన కూడా పరిచయం చెయ్యాలనే ఉదేశ్యంతో సౌత్ డైరెక్టర్స్ కొంతమందితో టచ్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ తో ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడు చర్చలు జరుపుతున్నారనే టాక్ నడుస్తుంది. అయితే అన్నీ సెట్ అయితే టాలీవుడ్ అర్జున్ రెడ్డి అదేనండి విజయ్ దేవరకొండతో జాన్వీ కపూర్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.

మంచి క్రేజ్ రావడం ఖాయం..!

తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ నటించవచ్చని తమిళ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. ముగ్గురు దర్శకులతో ప్రస్తుతం సినిమాలకు సంబంధించి జాన్వీ కపూర్ చర్చలు జరుపుతోందని రమేష్ బాలా వెల్లడించాడు. మరి రమేష్ బాలా చెప్పేదాని బట్టి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఈ ఏడాదే ఉండవచ్చు అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ నోటా సినిమా వచ్చే శుక్రవారం విడుదలవుతుంది. ఇక టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలు షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. గీత గోవిందం హిట్ తో విజయ్ క్రేజ్ బాగా పెరిగింది. అలాంటప్పుడు జాన్వీ కపూర్ విజయ్ సరసన నటిస్తే ఆటోమాటిక్ గా క్రేజ్ వస్తుందని… బోని కపూర్ కూడా ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. నిజంగానే విజయ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తే సౌత్ లో మంచి క్రేజ్ రావడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1