మళ్ళీ వార్తల్లోకి కొత్త బయోపిక్

ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే సక్సెస్ అయిన బయోపిక్స్ ఇప్పుడు తెలుగులోనూ జోరందుకున్నాయి. మహానటి మూవీ సక్సెస్ తో బాలకృష్ణ – క్రిష్ లు ఎన్టీఆర్ బయోపిక్ పనులను చకచకా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలైన క్రిష్ ఏ క్షణం అయినా ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు బయోపిక్స్ కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో గతంలో అనుకుని మానేసిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని ఇప్పుడు సెట్స్ మీదకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గోపీచంద్ బయోపిక్ పట్టాలెక్కేనా…

గతంలో ప్రవీణ్ సత్తారు.. సుధీర్ బాబు హీరో గా పుల్లెల గోపీచంద్ బయోపిక్ ప్లాన్ చేసాడు. ఆ సినిమా పట్టాలెక్కుతోంది అనుకున్న తరుణంలో కారణాలు తెలియాకుండా సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పుల్లెల గోపీచంద్ బయోపిక్ పనులు కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన సమ్మోహనం రేపు శుక్రవారం విడుదలకుంది. ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు పుల్లెల్ల బయోపిక్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఎలాగూ సుధేర్ బాబుకి బ్యాడ్మింటన్ లో మంచి ప్రవేశం ఉండడంతో.. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇండ్రస్టీని కించపరిచే వ్యాఖ్యలు…

ఇక ఈ సినిమాని వచ్చే సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇకపోతే సుధీర్ బాబు – అదితి రావు జంటగా ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సమ్మోహనం సినిమా మంచి అంచనాలతో విడుదలవుతుంది. కొత్త ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏవో పంచ్ లు వేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇండస్ట్రీని కించపరిచే విధంగా డైలాగ్స్ ఏం లేవని… కాకపోతే సినిమా వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది.. అది మాత్రమే ఈ సినిమా లో చూపించామని సుధీర్ బాబు చెబుతున్న మాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*