బయోపిక్స్ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేసారో తెలుసా..?

tamil films promotions in telugu

బయోపిక్స్ ట్రెండ్ అనేది బాలీవుడ్ వాళ్లే కనిపెట్టారని చెప్పుకుంటున్నారు. కానీ అసలు బయోపిక్ ను మొదట కనిపెట్టింది మాత్రం మణిరత్నం. ఇతని డైరెక్షన్ లో ‘ఇద్దరు’ అనే సినిమా వచ్చింది. ఇందులో ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల్ని చూపించాడు మణి. ఆ తర్వాత ఇటువంటి జోనర్ లో సినిమా ఒక్కటి కూడా రాలేదు. చాలాకాలం తర్వాత మణిరత్నం మళ్లీ ‘గురు’ అనే సినిమాతో ముందుకు వచ్చాడు. బిజినెస్ టైకూన్ ధీరుబాయి అంబానీ ప్రయాణమే ‘గురు’ సినిమా. ఇలా ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు రావడం స్టార్ట్ అయింది.

మహానటి సక్సెస్ తో…

మణిరత్నం తీసిన ‘ఇద్దరు’, ‘గురు’ సినిమాలు తెలుగులో విడుదల అయినప్పటికీ సరైన రుచిని చూపించింది మాత్రం నాగ్ అశ్విన్ కి దక్కుతుంది. అతని దర్శకత్వంలో ‘మహానటి’ సావిత్రి జీవితకథ వచ్చింది. ఈ సినిమాలో మహానటి జీవితాన్ని ఒక అద్భుతమైన దృశ్యంగా మలచాడు. ఇది సూపర్ హిట్ అవ్వడంతో బయోపిక్స్ తీయొచ్చు అనే నమ్మకం ఏర్పడింది మన డైరెక్టర్స్ కి. దాంతో వరసగా బయోపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, లక్ష్మి పార్వతి బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటశాల, కత్తి కాంతారావు, శోబన్ బాబు, కే విశ్వనాద్, పుల్లెల గోపీచంద్ బయోపిక్స్ మన ముందుకు రానున్నాయి.

ప్రకటించినవి తీస్తారా..?

అయితే ఇందులో ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్స్ తప్ప మిగతావన్నీ ప్రకటనలే అని అర్ధం అవుతున్నాయి. ఒకవేళ వచ్చినా అవి సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. సక్సెస్ అవ్వకపోతే మాత్రం మిగతావాటికి ఆదరణ దగ్గిపోయే ఛాన్స్ వుంది. ఒకవేళ బయోపిక్స్ హిట్ అయితే మాత్రం జాతీయ స్థాయిలో పేరు వస్తుంది. ఉదాహరణకు దంగల్, ధోని, బాగ్ మీల్కా, డర్టీ పిక్చర్ సినిమాలు. మరి ఎంతవరకు మన బయోపిక్స్ సక్సెస్ అవుతాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*