మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ…?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే కొందరు హందీ ఫిలిం మేకర్స్ తో సమావేశమయ్యారంట. భరత్ అనే నేను విడుదల తర్వాత మహేశ్ ఫ్యామిలీతో కలిసి విదేశీ విహారానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన అనేక ఫోటోలను స్వయంగా మహేశ్ సతీమణి నమ్రతనే సోషల్ మీడియాతో పోస్ట్ చేసింది. ఈ ట్రిప్ ముగించుకుని మహేశ్ ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు.

త్వరలోనే స్పష్టత…

అయితే, స్పెయన్ నుంచి నేరుగా ముంబై చేరుకున్న మహేశ్ అక్కడ కొందరు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తో సమావేశమయ్యారని వినిపిస్తోంది. కానీ, ఎవరిని కలిశారనేది మాత్రం స్పష్టత రాలేదు. త్వరలోనే మహేశ్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి స్పష్టత వస్తుందంటున్నారు. గతంలో పలు మహేశ్ సినిమాలు హిందీలో రీమేక్ అయినా, ఆయన నేరుగా మాత్రం బాలీవుడ్ లో నటించలేదు. ఇటీవల మహేశ్ కూడా ఓ ఇంటర్వ్యూలో తాను బాలీవుడ్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని, మంచి కథ దొరికితే సైన్ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మాత్రం మహేశ్ వంశీ పైడిపల్లితో కలిసి తన 25వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఈ మధ్య గడ్డంతో కొత్త లుక్ లో అభిమానులను ఆశ్చర్యపర్చారు.