ఇండియన్ బాక్సాఫీస్ మీద హీరోయిన్ల ఎటాక్!

ఒక్కప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే చిన్న చూపు ఉండేది. ఆ సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా పటించుకునేవారు కాదు. కమెర్షియల్ గా సక్సెస్ అయ్యేవి కావు. ఓపెనింగ్స్ కూడా పెద్దగా ఏమి ఉండేవి కావు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా భారీగా సక్సెస్ అవుతున్నాయి. సౌత్ లో అనుష్క, నయనతార లాంటి హీరోయిన్స్ సినిమాలు సక్సెస్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి.

దక్షిణాదిన ఇంకా సావిత్రి ఫీవర్….

ఈ కోవలోనే ఇప్పడు ‘మహానటి’ సినిమా కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఉన్నా ఇది ఒక లేడీకి సంబందించిన కథ కాబట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా మంచి టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లు రాబడుతోంది.

దూసుకెళ్తున్న రాజీ……

కర్ణాటక, కేరళలో ఈ సినిమాను విడుదల చేసారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా దక్షిణాది అంతటా జోరు సాగుతుండగా ఉత్తరాదిన మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ హవా సాగిస్తోంది. బాలీవుడ్ మూవీ ‘రాజి’ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.32 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. సో దీని పరంగా చూసుకుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద హీరోయిన్లే ఎటాక్ చేస్తుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*