బోయపాటి గట్టి దెబ్బ కొట్టాడుగా..!

vinaya vidheya rama shows stopped

బోయపాటిని కొత్తగా తీయమంటే ఏం తీస్తాడు చెప్పండి. రెగ్యులర్ స్టోరీనే అటు మర్చి ఇటు మర్చి తీస్తుంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో హీరో ని బాగా హైలైట్ చేయడం.. విలన్ ని చాలా ఘోరంగా చూపించడం వంటివి బోయపాటి చూపిస్తుంటాడు. ‘రంగస్థలం’ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న రామ్ చరణ్ కి ‘వినయ విధేయ రామ’ మూవీతో ఒక డిజాస్టర్ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ ఎవరూ తేరుకోలేనంత దెబ్బ తీసాడు బోయపాటి. తన మొదటి సినిమా ‘భద్ర’ నుండే స్టోరీ లో ఏమీ మార్పు ఉండదు. అదే చింతచిగురు పచ్చడి. అల్లు అర్జున్ కి ‘సరైనోడు’ లాంటి కమెర్షియల్ హిట్ ఇచ్చినట్టు తనకి కూడా మంచి హిట్ ఇస్తాడని ఆశతో బోయపాటితో ఫిక్స్ అయ్యాడు చెర్రీ. కానీ రిజల్ట్ వేరేలా వచ్చింది.

ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదే

రామ్ చరణ్ ని అయితే కొత్తగా చూపించాడు కానీ కథలో పట్టు లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం.. చివరి వరకూ విలన్ స్టామినాను పెంచుతూ వెళ్లాడు బోయపాటి. ఈ సినిమాలో ‘రక్తపాతం’ ఎక్కువ అయిపోయిందని టాక్ వినిపిస్తుంది. లాజిక్ లేని ఫైట్స్, కామెడీ సీన్స్ జనాలను విసిగించేలా ఉన్నాయని అంటున్నారు సాధారణ ప్రేక్షకులు. రివ్యూస్ లో అయితే సెటైర్స్ వేసి మరి ఏకిపారేస్తున్నారు. బీ,సీ సెంటర్స్ లో తప్ప ఈ సినిమా ఎక్కడా ఆడదని అర్ధం అవుతుంది. కొంతమంది ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా నచ్చడం లేదంటే ఇది ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*