అది మాత్రం మిస్ అవ్వడట బోయపాటి

డైరెక్టర్ బోయపాటి మేకింగ్ ఎలా ఉంటాదో వేరే చెప్పనవసరం లేదు. ఎటువంటి స్టోరీ అయినా మాస్ ఎలెమెంట్స్ కంపల్సరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ని తనదైన స్టైల్ లో తెరకెక్కించడం బోయపాటి స్టైల్. తన ప్రతి సినిమాలో యాక్షన్ కంపల్సరీ అన్న బోయపాటి బయోపిక్స్ పైన కూడా మనసు పారేసుకున్నాడు.

Vinaya vidheya ram poster review telugu post telugu news

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూస్ తన మనసులో మాటా చెప్పాడు. బియోపిక్స్ కూడా తీస్తాడు కానీ అందులో కొన్ని కండిషన్స్ అంట. ‘బయోపిక్ గ్యారెంటీగా చేస్తాను. కానీ ఆ బయోపిక్ లో కూడా దమ్ము ఉంటది.. యాక్షన్ కూడా ఉంటుందట. బయోపిక్స్ లో అయినా తన మార్క్ మాత్రం మిస్ అవ్వనని’ తెగేసి చెప్పాడు.

బయోపిక్స్ అంటే ఒకరి జీవితం గురించి చెప్పాలి. సాధారణంగా బయోపిక్స్ లో యాక్షన్స్ ఉండవు. అయినా కానీ బోయపాటి యాక్షన్ కి స్కోప్ ఉన్న కథలనే వెదికి పట్టుకుంటాడట. తన నమ్ముకున్న జానర్ నుండి బయటికి వచ్చే ప్రసక్తి లేదని చెబుతున్నాడు. జానర్స్ మార్చిన యాక్షన్ మాత్రం మిస్ అవ్వను అని అన్నాడు. అయితే బాలకృష్ణ తో తీసే సినిమా గురించి మాత్రం నోరు విప్పలేదు. ఈసినిమాకు సంబంధించి చాలావరకు స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదని ఫిలింనగర్ టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*