బ్రహ్మి జబర్దస్త్ ని పడేస్తాడా..?

నిన్నమొన్నటి వరకు వెండితెర మీద బ్రహ్మానందం చేసిన కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వేవారు. అహనా పెళ్ళంట, మని మని సినిమాలతో బ్రహ్మి కామెడీని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నా… బ్రహ్మీని ప్రస్తుతం ఆదరించే ప్రేక్షకులు కరువయ్యారు. బ్రహ్మి కామెడీ ప్రేక్షకులకు మొహం మెత్తేసింది. ఈటీవి ఛానల్ నుండి జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అనేకమంది కమెడియన్స్ వెండితెరకు పరిచయమవుతుంటే.. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ వెండితెర మీద చేసే కామెడీతో బ్రహ్మనందాన్ని దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేసారు. ఒకప్పుడు బ్రహ్మికి ప్రత్యేక కామెడీ పాత్రలు రాస్తే.. ప్రస్తుతం బ్రహ్మి ఉంటె సినిమాలు ప్లాప్ అనే స్టేజ్ లో కొచ్చేసాడు.

ఆ ప్రోగ్రాంకి పోటీగానేనా..?

అయితే వెండితెర మీద భారీ పారితోషకంతో ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందం ఇప్పుడు బుల్లితెర మీదకి వస్తున్నాడు. గతంలో బుల్లితెర మీద బ్రహ్మి కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోయినా… ప్రస్తుతం ఈటీవి లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంని తలదన్నేలా స్టార్ మా ఒక కామెడీ ప్రోగ్రాంని డిజైన్ చేస్తుంది. గతంలో ఈటీవి జబర్దస్త్ ప్రోగ్రాంకి ఆపోజిట్ గా ఎన్నిరకాల కామెడీ ప్రోగ్రామ్స్ చేసినా జబర్దస్త్ మీద మా ఛానల్ పైచెయ్యి సాధించలేకపోయింది. అయితే తాజాగా బ్రహ్మానందం యాంకరింగ్ తో ఒక స్టాండప్ కామెడీ ప్రోగ్రాంని స్టార్ మా ప్లాన్ చేస్తుంది. కేవలం ఈటీవి జబర్దస్త్ మీద పైచెయ్యి సాధించేందుకే బ్రహ్మి కి భారీ పారితోషకం ఇచ్చి మరీ ఈ కామెడీ ప్రోగ్రాం కి యాంకరింగ్ చేయించాలని డిసైడ్ అయ్యింది.

రోజుకు లక్షనా..?

మరి బ్రహ్మి కామెడీకి ఉన్న క్రేజ్ తోనే స్టార్ మా ఇలా ప్లాన్ చేసింది. బ్రహ్మి యాంకరింగ్ చేసే ఈ ప్రోగ్రాం కి సంబందించిన ఒక ప్రోమో కూడా స్టార్ మా ఛానల్‌లో ప్రస్తుతానికి టెలికాస్ట్ అవుతోంది. స్టార్ గ్రూప్ నేతృత్వంలో జరిగే నిర్మాణం కనుక.. మేకింగ్ వ్యాల్యూస్ ఆ మేరకే వున్నాయి. మరి వెండితెర మీద బ్రహ్మి కామెడీ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు దర్శక నిర్మాతలు ఆయనకి రోజుకి లక్ష చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా .. ఇప్పుడు బుల్లితెర మీద చెయ్యబోయే స్టాండప్ కామెడీ ప్రోగ్రాంకి కూడా బ్రహ్మికి కాల్షీట్లు రోజుకు లక్ష రూపాయల చొప్పున పారితోషకం ఇస్తున్నట్టుగా సమాచారమైతే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*