బ్రహ్మి మీద పగ తీర్చుకున్న డైరెక్టర్..?

ఈమధ్యన బ్రహ్మానందం నటించిన సినిమాలేవీ ఆడిన సందర్భాలే లేవు. చిన్న పాత్రలు లేవు, పెద్ద పాత్రలు లేవు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందానికి ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరావడం లెదు. పాత సినిమాలోని ఎక్స్ ప్రెషన్స్ తోనే బ్రహ్మి బోర్ కొట్టించేస్తున్నాడని… అసలు డైరెక్టర్స్ ఎవరూ బ్రహ్మి కి ఒక క్యారెక్టర్ ని కూడా తమ సినిమాల్లో సెట్ చేయడం లేదు. అయితే ఇప్పుడు బ్రహ్మి మీద ఒక డైరెక్టర్ పగ తీర్చుకున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ గా వినబడుతుంది. ఈమధ్యన అంటే తాజాగా బ్రహ్మానందం నటించిన నేలటిక్కెట్టు విడుదలై డిజాస్టర్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ సినిమా లో బ్రహ్మానందం పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంతలా ఆశ్చర్యపోవడానికి గల కారణం… ఈ సినిమాలో కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే కనిపించి అందులోనూ నేల మీద కూర్చుని వెర్రి చూపులు చూసుకుంటూ ఉండే పాత్ర అది.

పాత విషయాలను మనస్సులో పెట్టుకున్న కళ్యాణ్

మరి ఇలాంటి పాత్రల రేంజ్ కి బ్రహ్మి పడిపోయాడని కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉండగా.. ఇలాంటి పాత్రని కావాలనే కళ్యాణ్ కృష్ణ బ్రహ్మి కి ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. కళ్యాణ్ కృష్ణ తన తొలి సినిమా సోగ్గాడే చిన్నినాయనలో బ్రహ్మానందానికి నాగార్జున ఆత్మతో మాట్లాడే ఒక కీ రోల్ ఇచ్చాడు. అయితే సోగ్గాడే చిన్ని నాయన షూటింగ్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ని డెబ్యూ మూవీ చేస్తున్న కుర్రాడు అనే ఫీలింగ్ తో బ్రహ్మి బాగా ఇబ్బంది పెట్టాడట. దీంతో కళ్యాణ్ కృష్ణ కడుపులో పెట్టుకుని నేలటిక్కెట్టులో కావాలనే ఒక చిన్న పనికిమాలిన పాత్ర ఇచ్చి షూట్ చేసిన వాటిలో కూడా లెంగ్త్ పేరుతో ఎడిట్ చేసి పారేశారనే టాక్ వినిపిస్తుంది.

మరీ ఇలాంటి పాత్రలు అవసరమా..

మరి ప్రస్తుతం అవకాశాలు లేక బ్రహ్మానందం వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఇలాంటి పనికిమాలిన పాత్రలు చెయ్యడమెందుకు అంటూ కొందరు సెటైర్స్ వేస్తుండగా నేలటిక్కెట్టు సినిమ ఎలాగూ పోయింది.. బ్రహ్మికి పేరు రాకపోతే పెద్ద నష్టం లేదులే అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*