బన్నీకి దెబ్బ మామూలుగా తగలలేదుగా..?

అల్లు అర్జున్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే స్టేజ్ కి ఎప్పుడో చేరుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్లో డిజాస్టర్స్ కన్నా.. ఎక్కువ హిట్స్ ఉన్నాయి. మంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ స్పీడు బ్రేకర్స్ లేకుండా దూసుకుపోతున్న అల్లు అర్జున్ కి నా పేరు సూర్య బ్రేక్ వేసింది. అల్లు అర్జున్ గత సినిమా డీజే లో విషయమే లేదన్నారు. అయినా అల్లు అర్జున్ కి ఉన్న స్టామినా, క్రేజ్ ఆ సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. కానీ ప్రస్తుతం నా పేరు సూర్య విషయంలో అల్లు అర్జున్ మ్యాజిక్ పనిచేయలేదు.

భారీ ఎదురుదెబ్బే…

నా పేరు సూర్య కనీసం 80 కోట్లు వసూలు చేస్తేనే హిట్ అనిపించుకునే పరిస్థితి వచ్చింది. కానీ నా పేరు సూర్య చిత్రం విడుదల అయి మూడు వారాలు పూర్తయ్యే సరికే క్లోజింగ్ కు వచ్చేసింది. నా పేరు సూర్య విడుదలైన ఐదారు రోజులు మంచి వసూళ్లనే సాధించింది. కానీ మహానటి రాకతో నా పేరు సూర్య కి ఎదురు దెబ్బ తగలడం, సినిమా కలెక్షన్స్ కూడా పడిపోయి ఆఖరికి క్లోజింగ్ కలెక్షన్స్ 50.14 కోట్లు మాత్రమే రాబట్టింది.

మరీ ఇంత నష్టమా..?

మరి అల్లు అర్జున్ వెంటవెంటనే రెండు హిట్స్ ఇస్తేనే గాని ఈ సినిమా దెబ్బ నుండి కోలుకోలేడు. కొత్త దర్శకులను మరీ అంత గుడ్డిగా నమ్మకూడదు కూడా. వక్కంతం రైటర్ గా హిట్టే.. కానీ దర్శకుడిగా మాత్రం ప్లాప్. మరి అది ఎలాంటి ప్లాప్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపుగా 35 కోట్ల నష్టం తెచ్చేంతటి ప్లాప్ అన్నమాట. మరి సినిమాలో కంటెంట్ లేకపోయినా… అల్లు అర్జున్ స్టామినా కూడా ఈసారి మ్యాజిక్ చెయ్యలేక నా పేరు సూర్య ఫలితం తారుమారైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*