అవకాశం ఇస్తా..కాంప్రమైజ్ కావాలన్నాడు…

aditirao hopes on antariksham

తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేని హీరోయిన్ అదితిరావు హైదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కొన్నేళ్ల క్రితమే ఈ విషయం చెప్పినా, క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని అప్పట్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… 2013లో అవకాశం ఇస్తానని వచ్చిన ఓ డైరెక్టర్ కాంప్రమేజ్ కావాలని చెప్పినట్లు ఆమె చెప్పింది. తాను ఏడుస్తూ వచ్చేశానని ఆమె తెలిపింది. దీంతో ఎనిమిది నెలల పాటు తనకు ఏ సినిమా దొరకలేదని, అయినా పట్టించుకోలేదని చెప్పింది. ఎవరికైనా అటువంటి అనుభవం ఎదురైతే, అవకాశాల భయంతో బయటకు చెప్పరని, కానీ, మనవద్ద టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని, ఇటువంటి విషయాలపై నోరు విప్పాలని ఆమె కోరింది. ఇటీవల ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మోహనం సినిమాలో నటించిన అదితీరావు హైదరి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*