చై-సామ్ జంట వచ్చేస్తుంది

మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.

ఆగస్టు రెండో వారం నుంచి షూటింగ్

దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావు రమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు రెండోవారం నుంచి మొదలవుతుంది. గోపీసుందర్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.

తారాగణం:

నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1