బాబు పాత్రలో భల్లాలదేవుడు?

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణకి ఎంత క్లారిటీ ఉందో తెలియదు గాని బయట పుకార్లు పుట్టించే వాళ్లకి మాత్రం చాలా క్లారిటీ ఉంది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ దర్శకత్వంలో గ్రాండ్ గా లాంచ్ చేసినా మధ్యలో తేజ ఈ సినిమాను వదిలేసి వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఆ సినిమాని బాలకృష్ణ మళ్లీ ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళతాడో తెలియదు గాని ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. తాజాగా బాలకృష్ణ – తేజ ప్యాచప్ అవుతున్నట్లుగా వార్తలొచ్చాయి. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో అతి కీలక పాత్రలో టాలీవుడ్ విలన్ భల్లాల దేవుడు నటిస్తున్నాడని ప్రచారం మొదలైంది.

పుట్టినరోజుకు క్లారిటీ వచ్చేనా…?

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సీఎం కుర్చీని లాక్కున్నాడనే విషయం ఇప్పటికీ ప్రతిపక్షాల వారు గోల చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రను రానా చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. చంద్రబాబు పాత్రకు రానాను సంప్రదించగా రానా కూడా పాజిటివ్ గా స్పందించడమే కాదు అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నారు. అయితే రానా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే విషయమై ఈ నెల 28న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారని కూడా అంటున్నారు.

రెండోసారి సీఎంగా…

మరి ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రని నెగెటివ్ గా చూపిస్తారా? పాజిటివ్ గా చూపిస్తారా? అనే విషయం మాత్రం సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్. మరి లీడర్ లో యంగ్ సీఎం గా మెప్పించిన రానా ఎన్టీఆర్ బయోపిక్ లోనూ సీఎం గా నటిస్తాడని అంటున్నారు. చూద్దాం బాలయ్యకి పోటీగా రానా ఎలా మెప్పిస్తాడో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*