చరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు..?

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ – బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ కానీ.. టీజర్ కానీ రిలీజ్ చేస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తే వాళ్ల ఆశలను అడియాశలు చేశాడు చరణ్. చిరంజీవి పుట్టినరోజున కేవలం ‘సైరా’ ప్రొమోషన్స్ తప్ప తన సినిమా గురించి పట్టించుకోలేదు చరణ్.

అప్పుడూ ఇలానే చేసి…

నిర్మాతగా చరణ్ ఎక్కువ దృష్టి ‘సైరా’ మీద పెట్టి తన సినిమాను సైడ్ లైన్ చేస్తున్నాడు. ఇంకా రిలీజ్ ఎప్పుడో తెలియని ‘సైరా’ సినిమాకు ఇంతలా ప్రమోట్ చేసి.. మరో ఐదు నెలల్లో రిలీజ్ కావాల్సిన తన సినిమా ప్రొమోషన్స్ పై ఏమాత్రం ఫోకస్ పెట్టడం లేదు. చరణ్ ఇలానే ‘ధృవ’ అప్పుడు కూడా చేశాడు. ఆ టైం తన తండ్రి ‘ఖైదీ 150’ సినిమాపైనే ఫోకస్ పెట్టి తన సినిమాను మంచి సీజన్ లో రిలీజ్ చేయలేకపోయారు.

కనీసంగా పోస్టర్ కూడా…

ఎక్కువగా తన తండ్రి సినిమాల మీదే దృష్టిపెట్టి తన సినిమాను సైడ్ లైన్ చేయడం చరణ్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. మొదటిసారి బోయపాటి – చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి అందరిలోనూ సినిమా ఎలా ఉంటుంది.. చరణ్ లుక్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ఉంది. కానీ దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోవటం ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ఇకనైనా బోయపాటి సినిమా గురించి అలోచించి ప్రొమోషన్స్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఫ్యాన్స్ అసహనం ఎక్కువయ్యే అవకాశం ఉంది చరణ్ బాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*