చలో యూరప్ అంటున్న చెర్రీ

బోయపాటి శ్రీను – రామ్ చరణ్ లు బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కి వచ్చేసారు. ఇక హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా వేసిన సెట్ లో చరణ్ తోపాటు కుటుంబ సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించనున్నారు. అటు ఫ్యామిలీ సీన్స్ తో పాటు అల్యుమియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను కూడా బోయపాటి చిత్రీకరిస్తాడని చెబుతున్నారు. ఇక ఫ్యామిలీ షెడ్యూల్, యాక్షన్ సీన్స్ అన్నీ కలిపి ఒక 15 రోజుల పాటు హైదరాబాద్ లోనే RC12 షూటింగ్ జరగనుంది. చరణ్ – వివేక్ ఒబెరాయ్ కాంబోలో ఈ యాక్షన్ సీన్ ఉండబోతుంది. ఇక కైరా అద్వానీతో జోడి కడుతున్న రామ్ చరణ్ బోయపాటి సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు.

హైలౌట్ గా నిలవనున్న యూరప్ సీన్లు

ఎలాగూ హైదరాబాద్ లోనే షూటింగ్ అంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు. అలాగే సినిమాలో కూడా ఫ్యామిలీ సీన్స్ తో చరణ్ ప్రస్తుతం అటు రీల్ లైఫ్ ఫ్యామిలితోనూ, ఇటు రియల్ లైఫ్ కుటుంబంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక హైదరాబాద్ షెడ్యూల్ ముగియగానే చరణ్, బోయపాటి బృందం యూరప్ చెక్కెయ్యనుందట. యూరప్ లో చిత్రీకరించే సన్నివేశాలు RC12 కి మెయిన్ హైలైట్స్ గా నిలుస్తాయని.. ఈ షెడ్యూల్లోనే పాటలతో పాటుగా.. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీని జిమ్ లో బాగా కష్టపెడుతున్నాడు. అంటే బోయపాటి సినిమాలో చరణ్ మంచి బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తాడని గా ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

తొందరలోనే టైటిల్, ఫస్ట్ లుక్…

అందుకే బోయపాటి కూడా అతి త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేసి… దానితోపాటుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని వదిలేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మరి రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నాన్ బాహుబలి రికార్డులను సృష్టించిన రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటి సినిమా తోనూ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బోయపాటి సినిమాతో పాటుగా రామ్ చరణ్, రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1