బాబాయ్ బర్త్ డే గిఫ్ట్ ఇదేనా?

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ ఎంటెర్టైనెర్ షూటింగ్ ప్రస్తుతం ఒక మాదిరి స్పీడుతో జరుగుతుంది. నిన్నమొన్నటి వరకు షూటింగ్ ని పరిగెత్తించిన బోయపాటి.. మధ్యలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకి రామ్ చరణ్ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉండడంతో బ్రేకిచ్చాడు. ఇక తాజా షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేసిన బోయపాటి – రామ్ చరణ్ లు తమ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వదులుతారని మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ బోయపాటి గానీ, రామ్ చరణ్ గానీ చడీ చప్పుడు చెయ్యలేదు. ఇక చిరు పుటిన రోజు సందర్భంగా విడుదల చేస్తారు అనుకుంటే అదీ వెళ్లిపోయింది. ఇక చిరు బర్త్ డే కి సై రా టీజర్ తో పాటు చిరు సై రా లుక్ తోనే మెగా ఫాన్స్ కి పిచ్చెక్కిపోయింది.

పవన్ పుట్టిన రోజు కానుకగా…

చిరు బర్త్ డే కి సై రా లుక్, టీజర్ తో పండగ చేసుకున్న మెగా ఫాన్స్ మళ్లీ రామ్ చరణ్ లుక్, టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆగస్టు 15, చిరు బర్త్ డే మిస్ అయిన చరణ్ – బోయపాటి లు కనీసం పవన్ కళ్యాణ్ బర్త్ డేకి అయినా రివీల్ చేస్తారా అని చూడాలి. అయితే రామ్ చరణ్ మాత్రం బాబాయ్ బర్త్ డే రోజున తన కొత్త సినిమా లుక్, టైటిల్ కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో బీభత్సంగా హల్చల్ చేస్తుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా మెగా ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని చరణ్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

విలన్ గా బాలీవుడ్ స్టార్…

మరి ప్రస్తుతం రెండు మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి ఏ టైటిల్ ని పెడతారో తెలియదు గానీ.. ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం మెగా ఫాన్స్ బాగా ఎదురు చూస్తున్నాడు. ఇక బిహార్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా, విలన్ గా వివేక్ ఓబేరాయ్, మరో కీలక పాత్రలో ఆర్యన్ రాజేష్ నటిస్తున్నాడు. మరి రెండు స్పెషల్ అకేషన్స్ ని మిస్ చేసిన చరణ్ ఇప్పుడు మూడో అకేషన్స్ ని మిస్ చేస్తాడో… లేదంటే సర్ప్రైజ్ చేస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*