ఇప్పటికైనా వదులుతారా చరణ్..!

ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఫస్ట్ లుక్ లు, ఫస్ట్ టీజర్స్, టైటిల్ విడుదల అంటూ హడావిడి చేస్తున్నారు. సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ప్రేక్షకుల క్యూరియాసిటీ తమ సినిమాల మీద ఉండేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సినిమా మొదలైన కొన్నాళ్లకే స్పెషల్ అకేషన్ అంటూ టైటిల్ లేదంటే ఫస్ట్ లుక్ అంటూ వదిలి సినిమా మీద అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ప్రాజెక్టులైన ప్రభాస్ సాహో లుక్, అరవింద సమేత ఫస్ట్ లుక్, మహేష్ మహర్షి లుక్ లు సినిమాలు ప్రారంభమైన కొన్నాళ్లకే టైటిల్ తో సహా బయటికొచ్చేశాయి.

అకేషన్లు వెళ్లిపోతున్నా…

అయితే మరో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ మాత్రం తన కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఇంకా దోబూచులాడుతూనే ఉన్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ కొత్త సినిమా షూటింగ్ మొదలై చాన్నాళ్ళైంది. కానీ ఇంతవరకు చరణ్ కొత్త సినిమా లుక్ గాని టైటిల్ గాని బయటికి రాలేదు. సినిమా విషయాలేమి లీక్ కాకుండా చూసుకుంటున్న బోయపాటి బ్యాచ్ చరణ్ టైటిల్, లుక్ విషయంలో ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదా…? లేదంటే అంతా రెడీగా ఉండి… దాన్ని వదిలే టైం కోసం వెయిట్ చేస్తున్నారా? అంటే ఇప్పటికే రెండు స్పెషల్ అకేషన్స్ వెళ్లిపోయాయి.

వినాయక చవితికైనా విడుదల చేస్తారా..?

కనీసం చిరు బర్త్ డే రోజు అయినా, పవన్ పుట్టినరోజు అయినా చరణ్ లుక్, టైటిల్ బయటికొస్తుందనుకుంటే అదీ జరగలేదు. అయితే మెగా ఫాన్స్ మాత్రం చరణ్ కొత్త సినిమా లుక్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం యూరప్ లోని అజర్ భైజాన్ దేశంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన భరత్ భామ కియారా అద్వానీ నటిస్తుంది. అయితే చరణ్ – బోయపాటి సినిమా లుక్ అండ్ టైటిల్ ని వినాయక చవితి కానుకగా ఈ నెల 13 న విడుదల చేస్తారని.. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. అజర్ భైజాన్ కంట్రీ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనబడతాడని.. కాదు పక్కా మాస్ లుక్ అంటూ వార్తలొస్తున్నాయి. మరి వినాయక చవితి కానుకగా లుక్ అండ్ టైటిల్ ని వదులుతారో లేదంటే ఇది కూడా ఊహాగానమేనో తెలియాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*