చరణ్ తర్వాతి సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..!

రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇందులో చరణ్ కు జోడిగా సీఎం గర్ల్ ఫ్రెండ్ నటిస్తుంది. అదేనండి మహేష్ హీరోయిన్ కైరా అద్వాని చేస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

వంశీని కూడా లైన్ లో పెట్టాడు…

ఈ సినిమా తర్వాత చరణ్ రాజమౌళితో మల్టీ స్టారర్ చేయనున్నాడు. ఇది ఈ ఏడాది నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే రాజమౌళి తర్వాత చరణ్ లైన్ లో వంశీ పైడిపల్లిని పెట్టినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టుగా సమాచారం. స్టోరీ లైన్ బాగుంటంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఏప్రిల్ తర్వాతే…

ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. మహేశ్ తో ‘మహర్షి’ చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో అంటే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత చరణ్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు వంశీ. ఎలాగో చరణ్ – రాజమౌళి సినిమా అయ్యే పాటికి ఏడాది పైన పడుతుంది కాబట్టి.. వంశీ ఈ స్టోరీ చాలా కూల్ గా రెడీ చేద్దాం అనుకుంటున్నాడట. గతంలో చరణ్ – వంశీ కాంబినేషన్ లో ‘ఎవడు’ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1