చరణ్ పోలీస్ అయితే మరి ఎన్టీఆర్ ఏంటి..?

టాలీవుడ్ లో కొందరు హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ లు హైప్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలానే ప్రస్తుతం రాజమౌళి- రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో భారీ చర్చకు దారి తీస్తుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీగానే ఉండొచ్చని అర్ధం అవుతుంది. ఈ సినిమా ప్రకటించినప్పుడు నుండే ఈ సినిమాపై అనేక రూమర్లు వస్తున్నాయి.

మళ్లీ పువర్ ఫుల్ పాత్రలో…

ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రపై చాలా రూమర్లు వచ్చాయి. వాటిలో ఒకటి రామ్ చరణ్ ఇందులో ఒక పోలీస్ సీఐగా కనిపించబోతున్నారు అని. ఇప్పటికే రామ్ చరణ్ రెండుసార్లు పోలీస్ పాత్రల్లో కనిపించాడు. ఒకటి ‘ధృవ’లో, మరోటి బాలీవుడ్ మూవీ ‘తూఫాన్’ లో. అయితే ఇందులో ‘ధృవ’ హిట్ కాగా ‘తూఫాన్’ బిగ్గెస్ట్ ప్లాప్ అయింది. మరొకసారి ఈ మల్టీ స్టారర్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసరుగా రాంచరణ్ ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర పోషించడం గ్యారంటీ అంటున్నారు.

మరి ఎన్టీఆర్ సంగతి…

మరి రామ్ చరణ్ పోలీస్ అయితే ఎన్టీఆర్ పాత్ర ఏమై ఉండొచ్చు అనే కొత్త ఊహ మొదలైంది. ఎన్టీఆర్ ఒక నాయకుడిగా గాని..ఒక డిటెక్టివ్ గా గాని కనిపించే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. ఒకవేళ ఎన్టీఆర్ ఇందులో డిటెక్టివ్ అయితే రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ తెరపై పవర్ ఫుల్ గా ఉండే అవకాశం లేకపోలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*