చరణ్ నాకు తమ్ముడంటున్న పవర్ స్టార్!!

రామ చరణ్ రంగస్థలానికి సంబందించిన విజయోత్సవ వేడుకలు ఆగ కూడదు… ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్నది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన రంగస్థలం విజయోత్సవ వేడుకలకి ముఖ్య అతిధిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ మెగా అభిమానులయిన సోదరులకు, సోదరీమణులకు ప్రేమతో నమస్కరిస్తూ తన అన్నకొడుకు రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. హాలీవుడ్ బెస్ట్ పిలిమ్స్ కంటే రంగస్థలానికి ఎక్కువ రేటింగులు వస్తుంటే చాలా ఆనందం వేసింది. ఐఎండీబీ రేటింగుల్లో కూడా రంగస్థలం టాప్ సినిమాల్లో నిలిచింది. అందుకే ఈ సినిమాని చూస్తే థియేటర్ లోనే చూడాలని చెర్రీ తో కలిసి తొలిప్రేమ తర్వాత రంగస్థలాన్ని థియేటర్ లో చూశానని చెప్పుకొచ్చాడు.

ప్రేమతో ముద్దు పెట్టేసి….

అలాగే గత ఏడాది తాను ఒకసారి అన్నయ్య ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు చరణ్ మాసిపోయిన బట్టలు అంటే లుంగీ ,చొక్కాతో కనబడేసరికి చరణ్ ఏం చేస్తున్నాడు.. అసలు అనుకున్నాను. రంగస్థలంలో చిట్టి బాబు లాంటి పాత్ర చెయ్యడానికి గట్స్ ఉండాలి. అలాగే సిగ్గు కూడా వదిలెయ్యాలి. సిటీలో పుట్టిపెరిగిన చరణ్ కి పల్లెటూరు అంటే అస్సలు తెలియదు. అసలు చరణ్ కి ఎంతున్నా అణిగిమణిగి ఉండే తత్వం. రామ్ చరణ్ చిట్టిబాబుగా అమేజింగ్ పెరఫార్మెన్సు చేశాడంటూ.. పక్కనే ఉన్న రామ్ చరణ్ ని హత్తుకుని ప్రేమతో ముద్దు పెట్టేసాడు. ఇక చరణ్ కూడా అలానే బాబాయ్ ని హత్తుకుని ముద్దు పెట్టాడు. ఇక స్టేజ్ మీద ఈ దృశ్యాలు అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాబాయ్, అబ్బాయ్ లమధ్యన ఉన్న ప్రేమతో మెగా ఫాన్స్ పులకించిపోయారంటే నమ్మాలి.

ఆస్కార్ కు పంపాలి….

ఇక రామ్ చరణ్ తనకి తమ్ముడులాంటివాడని… అన్న వదినలు తనకు తల్లితండ్రులతో సమానం. ఇక నేను నిద్ర లేవకుండా ముసుగు తన్ని పడుకుంటే.. చరణ్ మాత్రం తెల్లారు జామునే వెళ్లిపోయి హార్స్ రైడింగ్ చేసేవాడు. అలా కష్టపడతాడు చరణ్. ఇక నాకు రంగస్థలం లో చేసిన చిట్టిబాబు చిన్న తమ్ముడు. అసలు చరణ్ ని వీడు వీడు అంటూ చాల తక్కువసార్లు సంభోదిస్తాను. అలాగే చరణ్ కష్టానికి ఎప్పుడు విజయం వరిస్తుంది… అసలు రంగస్థలం కథ మన కథ… అలాగే సుకుమార్ ప్రతిభని ప్రశంసించాలి. రంగస్థలాన్ని కచ్చితంగా ఆస్కార్ కి పంపాలి. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ ఆకాశానికెత్తేసాడు. ఈ సినిమాకి ఆస్కార్ రావాలి అంటూ పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ స్పీచ్ ని ముగించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*