ఇది చినబాబు కార్ల కహాని..

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చినబాబు నిర్మాతగా అరవింద సమేత – వీర రాఘవ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ వీర రాఘవగా… హీరోయిన్ పూజ హెగ్డే అరవింద గా కనిపించనున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లోకి మారిపోయాడు. అరవింద సమేత ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొట్టేసాడు. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత చినబాబు దర్శకుడు త్రివిక్రమ్ కి, హీరో ఎన్టీఆర్ కి కార్లు బహుమతిగా ఇచ్చినట్టుగా ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.

పాత కారు తీసేసుకున్న త్రివిక్రమ్…

అయితే చినబాబు అంత ఖరీదైన కార్లను పని లేకుండా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కి బహుమతిగా ఇవ్వలేదట. అసలు అజ్ఞాతవాసి దెబ్బకి ఆయన కార్లు కొని ఇంకా రిలీజ్ కానీ సినిమా దర్శక, హీరో కి గిఫ్ట్ ఇచ్చే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడా.. అనే అనుమానం కలగక మానదు. అయితే చిన బాబు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి బహుమతులుగా కార్లు ఇచ్చిన మాట వాస్తవం కాదని కొంతమంది వాదన. చినబాబు కొత్తగా ఒక ఖరీదైన కారును తీసుకున్నాడట. కానీ ఆ కారు కొన్న తర్వాత చినబాబుకు రేంజ్ రోవర్ వెలార్ పి 25 మోడల్ కారు మీదకి మనసు పోవడం.. వెంటనే ఆ కారుని కూడా ఆయన కొనుక్కోవడం జరిగిందట. అయితే చినబాబు ముందు కొన్న కారుని మార్చేద్దామనుకుంటే దానికి దర్శకుడు త్రివిక్రమ్… కారును మార్చవలసిన అవసరం లేదనీ, ఆ కారు నాకు కావాలని చినబాబు నుండి త్రివిక్రమ్ తీసుకున్నాడట.

ఎన్టీఆర్ కి ఇష్టమైన నెంబర్ తీసుకోవడంతోనే…

ఇక చినబాబు కొన్న రేంజ్ రోవర్ వెలార్ పి 25 కొత్తగా కారును .. అరవింద సమేత సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ కి ప్రొవైడ్ చెయ్యాలనుకున్నారట ఆయన. మరి ఎన్టీఆర్ కి ఆ కారుని షూటింగ్ కోసం ఇచ్చినా కూడా.. అందులో ఎన్టీఆర్ కి ఇష్టమైన నెంబర్ 9999 చినబాబు రిజిస్టర్ చేయించడంతోనే…. ఎన్టీఆర్ కి చినబాబు కారుని గిఫ్ట్ గా ఇచ్చాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇదండీ చినబాబు కార్ల కహాని.