చిరు బర్త్ డే కి అరాచకమే?

Konidela Chirenjeevi Konidela telugu news telugu post

చిరంజీవి 151 వ సినిమా సై రా నరసింహ రెడ్డి మొదలై రేపు ఆగష్టు కి ఖచ్చితంగా ఏడాది పూర్తి కావొస్తుంది. కాకపోతే గత ఏడాది డిసెంబర్ నుండి సై రా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్నప్పటికీ… షూటింగ్ కి మధ్య మధ్య న మాత్రం స్పీడ్ బ్రేకర్స్ వల్లే.. షూటింగ్ కి అంతరాయం కలుగుతూ వచ్చింది. మొదటి షెడ్యూల్ ఒక పది రోజులు చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. సెకండ్ షెడ్యూల్ చెయ్యడానికి దాదాపుగా మూడునాలుగు నెలలు టైం తీసుకుంటున్నాడు. పాపం తప్పు సురేందర్ రెడ్డిది కాకపోయినా… బాధ్యత మాత్రం ఆయనదే కదా. అయితే ఇప్పటివరకు నత్తనడక సాగిన సై రా నరసింహారెడ్డి షూటింగ్ ఈ నెలనుండి పరిగెత్తబోతుందట.

ఈనెల అంటే జూన్ 7న హైదరాబాద్‌లో మొదలయ్యే సై రా కీలక షెడ్యూల్ ఇక మీదట ఏకబిగిన 40 రోజుల పాటు సాగుతుందని… ఎన్ని అవాంతరాలొచ్చినా.. ఈసారి స్ట్రెచ్ బ్రేక్ కాబోదని మేకర్స్ ఇస్తున్న భరోసాగా చెబుతున్నారు. ఇలా ఎటువంటి అవాంతరాలొచ్చినా షూటింగ్ బ్రేక్ ఇవ్వకపోవడానికి గల కారణం చిరు సై రా ని ఎలాగైనా సమ్మర్ కి విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనే ఆలోచనట. అందుకే సురేందర్ రెడ్డికి సమ్మర్ కి ఎలాగైనా సైరా ని విడుదల చెయ్యాలనే టార్గెట్ ఫిక్స్ చేశారట. అందులో భాగంగానే సై రా టీమ్ మొత్తం ఇప్పుడు తెగ కష్టపడుతుందట. ఇక ఈ 40 రోజుల ఏకధాటి షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్‌తో కూడిన దృశ్యాలే ఎక్కువగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

అయితే సైరా మీద క్రేజ్ తగ్గుతుందని భావిస్తున్న దర్శకనిర్మతలు ఈ 40 రోజుల షెడ్యూల్ కంప్లీట్ కాగానే ఆగస్టు 22 అంటే చిరంజీవి పుట్టిన రోజున సై రా ఫస్ట్ లుక్ ని వదలాలని ప్లాన్ చేస్తున్నారట. మరి మామూలుగానే మెగాస్టార్ పుట్టిన రోజంటే మెగా అభిమానులకు పండగ. ఇప్పుడు మెగాస్టార్ కొత్త మూవీ లుక్ అంటే.. ఇక జాతరే జాతర. మరి ఎన్ని సైరా లుక్స్ లీకైనా ఇలా ఆఫీసియల్ లుక్ బయటికొస్తేనే కదా అసలు మజా.. ఇకపోతే ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా.. పలు భాష నటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*