అందుకే చిరు లావు అయ్యారు..!

చిరంజీవి ఈ మధ్య బాగా లావుగా కనపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఖైదీ 150 తో పోల్చుకుంటే ఈసారి మరీ లావుగా కనిపిస్తూ.. ఫిట్ నెస్ కోల్పోయినట్టు అనిపిస్తోంది. అయితే ఆలా సడన్ గా చిరంజీవి లావుగా మారటానికి కారణం సినిమానే అంట. ‘సైరా’ సినిమాలో ఓ గెటప్ కోసం చిరంజీవి ఇలా మారిపోయారట. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు అని తెలుస్తుంది.

హాలీవుడ్ స్థాయిలో…

ప్రస్తుతం దీనికి సంబంధించి సన్నివేశాలు హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ కోసం అక్కడ దాదాపు ఏడెకరాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పోవెల్ ఈ పోరాట సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నాడు. గతంలో ఆయన ఇంగ్లష్ చిత్రాలకు పని చేశారు. ముఖ్యంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, హ్యారీ పోటర్ సిరీస్, స్కైఫాల్ లాంటి సినిమాలకు పనిచేశాడు.

ఇంకా 30 శాతం షూటింగ్ కూడా…

‘సైరా’లో ఆ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో త్వరలోనే చిరంజీవితో పాటు విజయ్ సేతుపతి, తమన్నా కూడా చేరబోతున్నారు. ఈ షెడ్యూల్ కోసమే చిరంజీవి ఆలా లావుగా అయ్యాడని… ఆ తర్వాత మళ్లీ ఫిట్ అవుతాడని అంటోంది యూనిట్. దాదాపు ఆరు నెలలు నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది కానీ ఇప్పటి వరకు 30 శాతం కూడా షూటింగ్ కంప్లీట్ కాలేదు. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఇక ‘సైరా’ ఫస్ట్ లుక్ చిరంజీవి బర్త్ డే రోజున, అంటే ఆగస్ట్ 22న విడుదల చేస్తారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*