జాగ్రత్త పడకపోతే రజినీ పరిస్థితే..!

heroine in chiranjeevi movie

సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నాడనే ధీమాతో 2.ఓ చిత్రాన్ని సీజన్ కానీ సీజన్ లో రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇదివరకు లాగా తమిళ జనాలు రజినీని ఆదరించకలేపోతున్నారు. గత చిత్రాలు ‘కబాలి’, ‘కాలా’ రెండు సినిమాలను దారుణంగా తిప్పి కొట్టిన తమిళ జనం 2.ఓ చిత్రాన్ని కూడా అదే రీతిలో తిప్పికొట్టారు. కనీసం తెలుగు వారు ఆదరించనట్టుగా అయినా తమిళ జనాలు ఆదరించలేకపోతున్నారు. దీంతో ఈ చిత్రం తమిళంలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో స్టార్ హీరో మీద నమ్మకంతో ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెడితే థియేటర్స్ వద్ద టికెట్స్ తెగట్లేదు. ఆ రోజులు పోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తున్నారు, లేకపోతే సర్దుకో గురు అనేస్తున్నారు.

‘సైరా’ పై జాగ్రత్త పడాలి…

ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా భారీగా ఖర్చు పెట్టేస్తోన్న విషయం తెలిసిందే. చిరంజీవి రీఎంట్రీ మూవీ కాబట్టి ‘ఖైదీ నంబర్‌ 150’ చూశారు. అంతే కానీ ఈ సినిమా చూస్తారు అనే గ్యారెంటీ లేదు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరోనే రిజెక్ట్ చేసారు. తెలుగులోనూ అంతే క్రేజ్ ఉన్న చిరంజీవిని తిరస్కరించడం పెద్ద లెక్కేమీ కాదు. అలోచించి ఖర్చు పెడితే మంచిది. అవసరం అయితే రీషూట్లు చేసి అవుట్ పుట్ అంత ఓకే అనుకున్నాక రిలీజ్ చేస్తే మంచిది అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*