అవయవదానం చేసిన కళ్యాణ్ దేవ్

kalyan dev donated organs

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ… “నా అవ‌య‌వాలు దానం చేయాల‌ని నేను ప్ర‌తిజ్ఞ చేస్తున్నాను. ఆన్ లైన్ లో ఆర్గాన్స్ దానం చేయ‌డానికి కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే ప‌డుతుంది. ఇలాంటి అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకునే ముందు ఒక్క‌సారి మ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు చెబితే క‌చ్చితంగా వాళ్లు కూడా మ‌నం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని గౌర‌వించ‌డ‌మే కాదు సంతోషిస్తారు కూడా. సమయం వచ్చినప్పుడు అవయవాలను దానం చేయాలనే కోరికను నెరవేరుస్తున్న వాళ్ల‌లో మీరు కూడా ఒకరు అవుతారు. ఓ అంధుడు తొలిసారి ఈ లోకాన్ని మ‌న వ‌ల్ల చూస్తాడు అనే ఓ ఆలోచ‌నే నాకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మ‌రొక‌రికి జీవితాన్నిచ్చే అద్భుత‌మైన మ‌నిషిగా నేను మారాల‌నుకుంటున్నాను. ఈ య‌జ్ఞంలో మీరు కూడా భాగం కండి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లేట‌ప్పుడు ఎవ‌రూ ఏమీ తీసుకెళ్లం” అని చెప్పారు.

Sandeep
About Sandeep 6116 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*