చిరంజీవి కోసం తమన్నా త్యాగం…

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా చేస్తున్నాడు. గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా వివిధ భాషల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనల్లో ఉండటం వలన ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు.

ఆసక్తి పెంచుతున్న ప్రచారం…

ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నయనతార నటిస్తుండగా మరో కీలకమైన పాత్ర కోసం తమన్నాను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె నరసింహారెడ్డి కోసం ప్రాణత్యాగం చేసే వీరనారిగా కనిపించనుందనే ప్రచారం జరిగింది. ఆమె ఈ పాత్ర కోసమే గత కొంత కాలం నుండి ‘భరతనాట్యం’ నేర్చుకుంటోందనేది తాజా సమాచారం. మరోవైపు ‘వీరనారి’ అనే ప్రచారం .. మరో వైపున ‘భరతనాట్యం’ నేర్చుకుంటోందనే వార్త .. దాంతో ఆమె పాత్ర విషయంలో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా చూపించబోతున్నారని ఫిలింనగర్ లో మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై ఆఫిషియల్ అనౌన్స్ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*