బాలకృష్ణ వెళ్లిన చోటుకే చిరు..!

మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం `సైరా`కి లొకేష‌న్ల స‌మ‌స్య వ‌చ్చింది. చారిత్ర‌క నేప‌థ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లొకేష‌న్ల స‌మ‌స్య రావడం మాములే. ఎందుకంటే అప్పటి కట్టడాలు… వాహనాలు ఇప్పుడు లేవు కాబట్టి. అందుకే మన డైరెక్టర్స్ కూడా అంత రిస్క్ చేయడం ఇష్టం లేక సెట్స్ ని ఆశ్ర‌యిస్తారు. అందుకే ఇప్పటివరకు ‘సైరా’ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో సెట్స్ లోనే చేశారు.

ఇప్పుడు జార్జియాలో…

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. ఇప్పుటివరకు సెట్స్ లో చిత్రీకరించిన తర్వాత తొలిసారిగా ఈ యూనిట్ అవుట్ డోర్ వెళ్ల‌బోతోంది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో జార్జియాలో మొద‌లుకాబోతోంది. అక్క‌డ 20 రోజుల పాటు కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తారు. అక్కడ లొకేషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇదివరకు జార్జియాలోనే బాలకృష్ణ ‘గౌత‌మి పుత్ర శాత‌కర్ణి’ షూటింగ్ జ‌రిగింది. ఇప్పుడు అక్కడే ‘సైరా’ చిత్రం షూటింగ్ జరగనుంది.

బ్రిటీషర్ల సన్నివేశాలు అక్కడే…

అక్కడ బ్రిటీష్ ప్ర‌భుత్వం, బ్రిటీష్ ఆఫీస‌ర్లు వాళ్ల‌కు సంబంధించిన స‌న్నివేశాల్ని జార్జియాలో తెర‌కెక్కిస్తారు. అక్కడే కొన్ని యుద్ధ సన్నివేశాలు కూడా చిత్రకరించనున్నారు ‘సైరా’ టీం. అక్కడ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ లో మ‌రో షెడ్యూల్ మొద‌లు పెడ‌తారు. త్వరలోనే జార్జియాకు చిరు అండ్ టీం వెళ్లనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*