చిరు నుంచి ఎంతో నేర్చుకుంటున్నా..!

ఊసరవెల్లి, రేసుగుర్రం, ధృవ వంటి కమర్షియల్ చిత్రాల దర్శకుడికి ఒక్కసారిగా చిరంజీవి వంటి మెగాస్టర్ ని హీరోగా దేశంలోని పలు భాషల్లో భారీ ప్రాజెక్ట్ గా చరిత్రాత్మక చిత్రం సై రా నరసింహారెడ్డి తెరకెక్కించే అదృష్టం తగిలింది. ఇప్పటివరకు టాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన సురేందర్ రెడ్డి చిరు 151వ సినిమా సైరా నరసింహారెడ్డి తో ఇండియన్ మార్కెట్ ని టచ్ చెయ్యబోతున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ హీరోగా సై రా లాంటి బిగ్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్న సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో పనిచెయ్యడం కేవలం అదృష్టంగా ఫీల్ అవడమే కాదు.. ఆయనతో పనిచేస్తూ చిరు నుండి చాలానే నేర్చుకున్నానని చెబుతున్నాడు.

ఆయనను చూసి మార్చుకున్నా…

అసలు సై రా ప్రాజెక్ట్ తన చేతికేలా వచ్చింది.. అలాగే మెగాస్టార్‌తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం గురించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ .. మెగాస్టార్‌ వ్య‌క్తిత్వం ఒక పుస్త‌కం లాంటింద‌ని… బాస్ మెగాస్టార్ తో ప‌నిచేయ‌డం వ‌ల్ల ఎంతో జ్ఞానం పెరిగింద‌ని చెప్పిన సురేందర్ రెడ్డి… వ్య‌క్తిత్వంలో ఆయ‌న్ని అనుస‌రిస్తాన‌ని చెబుతున్నాడు. చిరంజీవి గారిని చూసి నా అల‌వాట్లు, అభిరుచులు కూడా మార్చుకున్నాన‌ని… మెగాస్టార్‌తో ప‌నిచేస్తుంటే స‌మ‌యం తెలియ‌డం లేదన్నాడు. త‌న‌ ద‌ర్శ‌కుడికి ఎప్పుడూ ఆయ‌న ఉత్సాహం ఇస్తారు. అందుకే త‌న‌తో మ‌రింత ప్ర‌యాణం చేయాల‌నుంది. అస‌లు మెగాస్టార్‌ను నేనే డైరెక్ట్ చేస్తున్నానా..? అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంటుంది. అదో గొప్ప అనుభూతి అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరుతో కలిసి పనిచేస్తునందుకు అనందంగా ఫీల్ అవుతున్నాడు.

టీజర్ తోనూ అనుమానాలకు చెక్…

అసలు సురేందర్ రెడ్డికి మెగా ప్రాజెక్ట్ సై రా వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చెయ్యగలడు ఈ కమర్షియల్ డైరెక్టర్ అని అనుకున్నారు అంతా. కానీ సురేందర్ రెడ్డి టేకింగ్ ఎలా ఉంటుందో సై రా లో చిరు లుక్, టీజర్ తోనే అర్ధమైంది. సురేందర్ రెడ్డి సై రా ప్రాజెక్ట్ ని ఎంత పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నాడో అనేది అందరికీ ఒక క్లారిటీ వెచ్చేసింది. అప్పటి వరకు సురేందర్ మీదున్న అనుమానాలన్నీ సై రా టీజర్ తోనే పటాపంచలైపోయాయి. ఇక చిరు హీరోగా నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు.