చిరు లేకుండానే కానిచ్చేస్తున్నారా…!

రీసెంట్ గా హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సైరా టీం కొన్ని రోజుల కిందట యూనిట్ మొత్తం జార్జియా వెళ్లింది. అక్కడ కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అందుకుగాను టెంట్స్ కూడా వేశారు. యూనిట్ మొత్తం ఆ పనుల్లో బిజీ అయిపోయిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఆ యుద్ధం చేయాల్సిన హీరో ఎక్కడ.? అదే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉన్నారు.? ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. యూనిట్ మొత్తం జార్జియాలో ఉంటె చిరంజీవికి ఇక్కడ ఏం పని అంటారా.? ఆయన ప్రస్తుతం ఇక్కడ చిన్న సినిమాలను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం జార్జియాలో ఎటువంటి షూటింగ్ జరగడం లేదు. అక్కడ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్ ఆధ్వర్యంలో యుద్ధ సన్నివేశాల రిహార్సల్స్ జరుగుతున్నాయి అంతే. అంతా సెటప్ చేసిన తర్వాత చిరంజీవి వెళ్లనున్నారు.

చిరు కోసం ప్రత్యేక ఏర్పాట్లు…

మరోపక్క జార్జియాలో తన తండ్రికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్పెషల్ కార్ వ్యాన్ ను కూడా సిద్ధం చేసాడట చరణ్. అంతేకాదు చిరంజీవికి కావాల్సిన ఇండియన్ వంటకాల్ని సిద్ధం చేసేందుకు ఏకంగా ఆరుగురు చెఫ్ లను ఏర్పాటు చేస్తున్నాడు. జార్జియాలో భారీ ఎత్తున అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాలను తీయబోతున్నామంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1