సునీల్ సందడేదమ్మా….

sunil comments on trivikram srinivas

మొదటి నుండి శ్రీను వైట్ల సినిమాలంటే కామెడీ దండిగా ఉంటుంది. రెడీ, ఢీ, దూకుడు, దుబాయ్ శీను, బాద్షా ఇలా అన్ని సినిమాల్లో శ్రీను వైట్ల కామెడికే పెద్ద పీట వేసాడు. ఈసారి కూడా శ్రీను వైట్ల కామెడీని బాగా నమ్ముకున్నట్టుగానే కనబడుతుంది. మిస్టర్ తర్వాత మాయమైన శ్రీను వైట్ల చాలా రోజులకు రవితేజ తో కలిసి సక్సెస్ ట్రాక్ ఎక్కటానికి అమర్ అక్బర్ ఆంటోనీతో తీవ్రంగా కష్టపడ్డాడు. ఈ రోజు విడుదలవుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా హిట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ ప్లాప్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కి ఒక పెద్ద కేరెక్టర్ శ్రీను వైట్ల ఇచ్చాడని.. ఈ సినిమాతో సునీల్ కి మంచి పేరొచ్చి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడతాయనే టాక్ నడిచింది. అరవింద సమేత సినిమాలో నీలాంబరిగా కథకు తగ్గ కామెడీ చేసిన సునీల్ కి ఆ సినిమా తో వచ్చిపడింది ఏమి లేదు. అయితే సునీల్ మాత్రం ఈ అమర్ అక్బర్ ఆంటోని సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో సునీల్ కి శ్రీను వైల్ట్ ఫుల్ లెన్త్ రోల్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా… సెకండ్ హాఫ్ లో సునీల్ జాయిన్ అవుతాడని…. అతని పేరు బేబీ సిట్టర్ బాబీ..ఈ పాత్ర ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.. అని చెప్పాడు. అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లుగా కనబడుతుంది సునీల్ వ్యవహారం. ఎందుకంటే సునీల్ పాత్ర బావుంటే గనక.. సునీల్ అమర్ అక్బర్ ఆంటోని కమెడియన్ ప్రెస్ మీట్ కి హాజరవ్వాలి. కానీ మొన్న సాయంత్రం జరిగిన అమర్ అక్బర్ ఆంటోని కమెడియన్స్ ప్రెస్ మీట్ కి హాజరవలేదు. అలాగే ఈ సినిమాలో తన కేరెక్టర్ గురించి సింగిల్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. మరి సునీల్ పాత్ర అమర్ అక్బర్ ఆంటోనిలో పెద్దగా లేదా.. అందుకే సునీల్ అలిగాడా…? ఏమో ఏదైనా గాని మీడియాలో అమర్ అక్బర్ ఆంటోని హీరో, హీరోయిన్, దర్శకుడు హడావిడి తప్ప కమెడియన్ సునీల్ సందడి ఎక్కడా కనబడడం లేదు. అరవింద సమేత చిన్న పాత్రకే సునీల్ అప్పట్లో ఎంతగా హడావిడి చేసాడో వేరే చెప్పక్కర్లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*