వివాదాలు విజయ్ కి కలిసొస్తున్నాయా..?

ప్రస్తుతం విజయ్ సర్కార్ మూవీ తమిళనాట పెను సంచలనాలు సృష్టిస్తుంది. తమిళనాట అధికారంలో ఉన్న ప్రభుత్వం సర్కార్ సినిమా మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అలా సర్కార్ వివాదాల్లో చిక్కుకుంది. సర్కార్ సినిమా సూపర్ హిట్ అవలేదు. కానీ నెగెటివ్ టాక్ తోనే కలెక్షన్స్ కుమ్మేస్తుంది. ఇక ఇప్పుడు ఈ వివాదాలతో సినిమకు మరింత పబ్లిసిటీ జరిగి కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయం. అయితే విజయ్ కి ఇలా జరగడం కొత్తేమి కాదు.

మెర్సిల్ కూడా ఇలానే…

విజయ్ గత చిత్రం మెర్సల్ చిత్రం కూడా విడుదలైన మొదటి షోకి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాకి కలెక్షన్స్ రావన్న సమయంలో… బిజెపి ప్రభుత్వంతో పాటు డాక్టర్స్ అసోసిషియన్ అంతా కలిసి మెర్సెల్ సినిమా వలన తమ పరువుకు భంగం కలుగుతుందని నానా రచ్చ చేశారు. అలా మెర్సెల్ కి ఫ్రీగా పబ్లిసిటీ చేసిపెట్టి మరీ మెర్సెల్ కి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చేలా చేశారు. మరి మెర్సెల్ హిట్ అవకపోయినా… కలెక్షన్స్ మాత్రం అదుర్స్. మెర్సెల్ కలెక్షన్స్ అంతగా రావడానికి కారణం ఆ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడమే. మరి తాజాగా సర్కార్ చిత్రం కూడా వివాదాలకు కేరాఫ్ అయ్యింది.

వివాదాలతో కలెక్షన్స్…

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాకి యావరేజ్ టాకే వచ్చింది. కానీ విజయ్ స్టామినా, మురుగ మీదున్న నమ్మకంతో ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్న టైం లోనే…. సర్కార్ కూడా వివాదాల్లో చిక్కుకోవడంతో… ఆ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం తమిళనాట సర్కార్ సినిమా విషయంలో జరిగే రచ్చతో సినిమా మీద మరింత ఆసక్తి జనాల్లో పెరుగుతుంది. అలా అనుకోకుండా సర్కార్ సినిమాకి కలెక్షన్స్ పెరిగి సూపర్ హిట్ అవడం ఖాయమే. మరి అనుకోకుండా విజయ్ కి వివాదాలు అలా కలిసొస్తున్నాయ్ అన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*