కావాలనే కాంట్రవర్సీలు చేస్తున్నారా..?

విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్ ఐకాన్. విజయ్ దేవరకొండ కి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతమున్న ఏ హీరోకి లేదు. అందుకే యూత్ పల్స్ ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా తన ఫాన్స్ ని రౌడీలుగా వైరైటీగా సంబోధిస్తూ రౌడీ వెబ్ సైట్ ని లాంచ్ చేసాడు. ఆ వెబ్ సైట్ ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటానని చెప్పడమే కాదు… తన సినిమాలను వెరైటీగా ప్రమోట్ కూడా చేస్తున్నాడు. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ మీద భారీ అంచనాలు, క్రేజ్ కూడా వచ్చేసింది. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గీత గోవిందం పై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. చాల నీట్ గా, రొమాంటిక్ ఎంటెర్టైనెర్ గా ఈ సినిమా టీజర్ చూస్తే అనిపిస్తుంది.

విజయ్ పాటలో కాంట్రవర్సీ

మరి అలాంటి ఈ సినిమా ఇప్పుడు కాంట్రవర్సీలకు నెలవుగా మారింది. అంత మంచి చిత్రాన్ని ఇలా వివాదంలోకి కావాలనే గీత గోవిందం హీరో విజయ్ తో పాటుగా చిత్ర బృందం కూడా లాగినట్టుగా అనుమానం కలుగుతుంది. ఈ మధ్యన సినిమాల మీద వివాదాలు షురూ అయితే ఆ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసి జనాల్లోకి చొచ్చుకుపోతుంది. అలాగే సినిమాలు కూడా అంటే హిట్ అవుతున్నాయి. ఉదహరణకు అర్జున్ రెడ్డి సినిమా విషయమే తీసుకోండి. ఆ సినిమా విడుదలకు ముందు ఎంతగా రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకే విజయ్ ఇప్పుడు అదే ప్లాన్ చేసాడనుకుంటా. గీత గోవిందం సినిమాకి సంబంధించిన ఒక పాటను తానే పాడి యూట్యూబ్ లో వదిలాడు. విజయ్ పాడిన ఆ పాట ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యింది. రాముడు గాని ఇప్పుడు పుట్టి… జంగల్ కు పోదాం రారమ్మంటే… అనే చరణం తో సాగుతుంది ఆ సాంగ్.

హైప్ తెచ్చే ప్రయత్నాలా..?

మరి ఆ పాటలోని పాత్రలన్నీ పురాణాలకు సంబంధించినవే. అయితే ఆ పాట ఒక వర్గాన్ని కించపరిచినట్లుగా ఉందంటూ ఓ వర్గం వారు ఆ పాట పై విమర్శనాస్త్రాలు సంధించారు. మరి అంత క్లీన్ గా వున్న ఈ సినిమాకి అలాంటి పాటను పెట్టడం ఎందుకు. మరి కావాలని ఈ సినిమా ని వివాదాల్లోకి లాగాలని విజయ్ దేవరకొండ బ్యాచ్ భావిస్తుందా… లేదంటే ప్రత్యేకించి హీరో విజయ్ పాడాడు కాబట్టి ఈ పాటని క్రేజ్ కోసమే యూట్యూబ్ లో వదిలారా… మరి ఈపాట మాత్రం యువతకు బాగానే కనెక్ట్ అయ్యింది కూడా. మరి కాంట్రవర్సీలతో ఈ గీత గోవిందానికి మరింత హైప్ తెచ్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయనేది ఇన్సైడ్ టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*