ఒక్క పోస్టర్ పై ఇంత వివాదామా..?

ఈ మధ్యన కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుని.. విపరీతమైన పబ్లిసిటీ తో కంటెంట్ లేకపోయినా.. సూపర్ హిట్స్ అవుతున్నాయి. అలాగే వివాదాలపరంగా తెగ ఫేమస్ అవుతున్న కొన్ని చిత్రాలు హిట్ అవ్వాల్సింది… బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అలాంటి వాటిలో కోలీవుడ్ హీరో విజయ్ నటించి మెర్సల్, బాలీవుడ్ లో దీపికా పదుకొనె నటించిన పద్మవత్ చిత్రాలు ఉన్నాయి. విజయ్ మెర్సల్ చిత్రంలో గట్టి కంటెంట్ లేకపోయినా… ఆ సినిమా విడుదలయ్యాక వైద్యుల సంఘాలు, బిజెపి నేతలు చేసిన రచ్చ వలన హిట్ అవ్వాల్సిన సినిమా కాస్తా సూపర్ హిట్ అవడమే కాదు… భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక పద్మవత్ చిత్రం కూడా అంతే. విడుదలకు ముందే వివాదాల్లో కూరుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ తెచ్చుకుంది.

పోస్టర్ తోనే వివాదాలు…

ఇక తాజాగా మురుగుదాస్ – విజయ్ కలయికలో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సర్కార్ సినిమా విషయంలోనూ పైన చెప్పిన విధంగా వివాదం రాజుకుంది. మురుగుదాస్ – విజయ్ కాంబో మీద ప్రేక్షకుల్లో, ఫాన్స్ లో, ట్రేడ్ లో భారీ క్రేజ్ ఉంది. అందులో వారిద్దరూ కలిసి రెండు సూపర్ హిట్ సినిమాలకు పని చేశారు. అందుకే వారి కాంబో మీద అంత క్రేజ్. అయితే వారి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా గా తెరకెక్కుతున్న సర్కార్ సినిమా మీద వివాదాలు ముసురుకున్నాయి. సర్కార్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ స్టైలిష్ గా కూర్చుని సిగరెట్ కలుస్తున్నట్టుగా ఉంది. ఇక ఆ పోస్టర్ లో క్యాన్స‌ర్ కార‌క‌మైన పొగాకు ఉత్ప‌త్తుల్ని ప్ర‌మోట్ చేయ‌డం నేరం అంటూ కొందరు రచ్చ మొదలెట్టారు.

రూ.పది కోట్లు చెల్లించాలి…

స్టార్ హీరో అయ్యుండి అలా పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చెయ్యడమేమిటంటూ… కొందరు సర్కార్ యూనిట్ తో పాటుగా విజయ్ మీద విరుచుకుపడ్డారు. అయితే ఆ గొడవ సర్దుమణుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో తాజాగా నిర్మాత క‌ళానిధి మార‌న్ పది కోట్లు పరిహారం చెల్లించాలని.. ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంలో భాగంగా డిమాండ్ చేస్తున్నారు కొందరు. ఇక ఆ పది కోట్లను వారు ఒక క్యాన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌కి డొనేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడా డిమాండ్ కోలీవుడ్ లో పెద్ద రచ్చ అవుతుంది. ఇలా ఒకే ఒక్క పోస్టర్ వలన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ రావడంతో.. సినిమాపై ఎక్కువ అంచనాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఒక్క పోస్ట‌ర్‌తోనే ఇంత పెద్ద వివాదం రాజుకుంది. ఇక సినిమా రిలీజైతే ఇంకెంత వివాదం రాజేస్తుందోన‌న్న ఆందోళ‌న ఇప్పుడు మూవీ యూనిట్ లో నెలకొన్నట్లుగా కోలీవుడ్ టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*