దబాంగ్ 3 ఈ ఏడాదిలోనే…!

సల్మాన్ ఖాన్ ఇప్పుడు మంచి జోరు చూపిస్తున్నాడు. ట్యూబ్ లైట్, రేస్ 3 సినిమాలు హిట్ కాకపోయినా.. సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్ తో ఆ సినిమాల నిర్మాతలను చాలా వరకు సేఫ్ లోనే ఉంచాడు. తాజాగా సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది అనుకుంటే… సినిమా మొదలవ్వక ముందే ప్రియాంక చోప్రా హ్యాండ్ ఇవ్వడంతో.. ఇప్పుడు భరత్ సినిమాలో సల్మాన్ కి జోడిగా కత్రినా కైఫ్ నటిస్తుంది. రేస్ 3 లో కూడా సల్మాన్ ఖాన్ సరసన కత్రినానే నటించింది. మరి భరత్ సినిమా సెట్స్ మీదుండగానే సల్మాన్ మరో మూవీని మొదలు పెట్టబోతున్నాడు.

బాలీవుడ్ లోకి జగపతి బాబు ఎంట్రీ..

దబాంగ్ సిరీస్ తో అదరగొట్టే హిట్స్ అందుకున్న సల్మాన్ ఖాన్ ప్రభుదేవా డైరెక్షన్ లో ఇప్పుడు దబాంగ్ 3 ని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నాడు. సోనాక్షి సిన్హా తో కలిసి దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న సల్మాన్ ఖాన్ మరోసారి సోనాక్షి తోనే కలిసి దబాంగ్ 3 లో నటించబోతున్నాడు. ఈ విషయం చెప్పిన సోనాక్షి సిన్హా దబాంగ్ 3 ఈ ఏడాది చివరి నుండి మొదలు కాబోతుందని… ఈ సినిమా కోసం చాల ఆసక్తిగా ఉన్నానని చెప్పింది. ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథ తో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగనుందని సమాచారం. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ లో ప్రస్తుతం విలన్ గా ఒక వెలుగు వెలుగుతున్న జగపతి బాబు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*