హాట్ ఫోటోలతో కొత్త పెళ్లికూతుళ్ల రచ్చ..!

deepika priyanka stills for magazines

బాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ కొద్ది రోజుల తేడాతో పెళ్లిపీటలెక్కారు. ఒకరు దీపికా పదుకొనే, మరొకరు ప్రియాంక చోప్రా. ఐదేళ్ల ప్రేమను రణ్వీర్ సింగ్ తో పంచుకున్న దీపికా పదుకొనే నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో పెళ్లి చేసుకుంటే…. ప్రియాంక మాత్రం నిక్ జోనస్ ని ప్రేమించి డిసెంబర్ 1న పెళ్లాడింది. మరి ఒకే రకమైన స్టార్ డం ని మెయింటైన్ చేసిన ఈ హాట్ హీరోయిన్స్ ఇద్దరూ తమకి నచ్చిన వాళ్లని పెళ్లాడి ఒక ఇంటివారయ్యారు. మరెప్పుడూ హాట్ నెస్ కి ప్రతీకగా నిలిచే ఈ కొత్త పెళ్లి కూతుళ్లు పెళ్లయ్యాక కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లికి ముందే మ్యాగజైన్స్ కోసం చేయించుకున్న హాట్ ఫొటోస్ ఇప్పుడు పెళ్లి తర్వాత మ్యాగజైన్స్ కి ఎక్కడమే కాదు… సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

deepika still

హాట్ ఫోటోలతో రచ్చ…

దీపికా పదుకొనే జిక్యూ ఇండియా కోసం ఇచ్చిన సింగల్ బికిని స్టిల్స్ మతులు పోగొడుతున్నాయి. బ్యాక్ లెస్ బ్యూటీనెస్ తో పాటు ఒంపుసొంపులన్నీ ఎడారి ఇసుక మీద పరిచినట్టు దీపికా ఇచ్చిన స్టిల్ చూసి కుర్రకారుకు గుండెల్ని అమాంతం ఎవరో పిండేసినట్టుగా ఉందంటున్నారు. ఇక మరో భామ ప్రియాంక చోప్రా కూడా వోగ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజు చూసిన ఎవ్వరైనా ఈ భామ హాలీవుడ్ లోనే సెటిలైపోతే మన పరిస్థితి ఏమిటి అంటూ కుళ్లుకుంటున్నారు. మరి పెళ్లి తర్వాత ఇలా మ్యాగజైన్స్ మీద కొత్త పెళ్లి కూతుళ్ల రచ్చ మాత్రం మామూలుగా లేదు.

priyanka still for vogue

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*